బెంగళూరుకు షాక్‌.. పంజాబ్‌ విజయం

తాజా వార్తలు

Published : 01/05/2021 01:11 IST

బెంగళూరుకు షాక్‌.. పంజాబ్‌ విజయం

కోహ్లీసేనపై 34 పరుగుల తేడాతో గెలుపు..

 

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమిపాలైంది. దీంతో కోహ్లీసేన ఈ సీజన్‌లో రెండో ఓటమి చవిచూసింది. రాహుల్‌ సేన నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ 145/8 స్కోరుకే పరిమితమైంది. దాంతో పంజాబ్‌ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఛేదనలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(35; 34 బంతుల్లో 3x4, 1x6), రజత్‌ పాటిదర్‌(31; 30 బంతుల్లో 2x4, 1x6), హర్షల్‌ పటేల్‌(31; 13 బంతుల్లో 3x4, 2x6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. పంజాబ్‌ విజయంలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ కీలకంగా వ్యవహరించాడు. వరుస ఓవర్లలో కోహ్లీ, మాక్స్‌వెల్‌, డివిలియర్స్‌ను ఔట్‌ చేసి ఆర్సీబీని కోలుకోలేని దెబ్బతీశాడు. చివర్లో జేమీసన్‌(16 నాటౌట్‌)తో కలిసి హర్షల్‌ ధాటిగా ఆడినా అప్పటికే పంజాబ్‌ విజయం ఖాయమైంది. మిగతా పంజాబ్‌ బౌలర్లలో రవిబిష్ణోయ్‌ రెండు వికెట్లు తీయగా షమి, జోర్డాన్‌, మెరిడిత్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(91 నాటౌట్‌; 57 బంతుల్లో 7x4, 5x6) మరోసారి దంచికొట్టాడు. అతడికి క్రిస్‌గేల్‌(46;  24 బంతుల్లో 6x4, 2x6), హర్‌ప్రీత్‌బ్రార్‌(25; 17 బంతుల్లో 1x4, 2x6) సహకరించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో జేమీసన్‌ రెండు వికెట్లు తీయగా చాహల్‌, సామ్స్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని