pv sindhu: ఒలింపిక్స్‌ కోసం ఎంతో కష్టపడ్డా: పీవీ సింధు

తాజా వార్తలు

Updated : 02/08/2021 12:56 IST

pv sindhu: ఒలింపిక్స్‌ కోసం ఎంతో కష్టపడ్డా: పీవీ సింధు

టోక్యో: తాజా ఒలింపిక్స్‌ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కాంస్యం గెలవడం సంతోషంగా ఉందని స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, పీవీ సింధు అన్నారు. సోమవారం ఆమె టోక్యో నుంచి కోచ్‌ పార్క్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో నా బలహీనతలపై దృష్టి పెట్టా. నాకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌ పార్క్‌ ఎంతో కష్టపడ్డారు. డిఫెన్స్‌ మెరుగుపరుచుకోవడంతోనే పతకం సాధ్యమైంది. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్‌ ఎంతో ఉపయోగపడింది. దేశానికి పతకం తీసుకురావడం గర్వంగా ఉంది. అదే సమయంలో సెమీస్‌లో ఓడిపోవటం చాలా బాధగా అనిపించింది. సెమీస్‌లో ఓటమి సమయంలో భావోద్వేగానికి లోనయ్యా. కాంస్యం అవకాశం ఉందని సర్ది చెప్పుకొన్నా. పారిస్‌ ఒలింపిక్స్‌కు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ విజయాన్ని నా కుటుంబానికి, అభిమానులకు అంకితం చేస్తున్నా.’’ అని సింధు చెప్పుకొచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని