close

తాజా వార్తలు

Published : 23/09/2020 07:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహీ: వ్యూహం కాదు.. సన్నద్ధత లేకే

కరణ్‌, జడ్డూను ముందుగా పంపిస్తున్న గ్రేట్‌ ఫినిషర్‌

షార్జా: అంతర్జాతీయ క్రికెట్లో అతిగొప్ప ఫినిషర్లలో మహేంద్రసింగ్‌ ధోనీ ఒకరు. టాప్‌ నుంచి మిడిలార్డర్‌ వరకు ఎక్కడైనా ఆడగల సమర్థుడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆడిన రెండు మ్యాచుల్లో మాత్రం లోయర్‌ ఆర్డర్‌లోనే ఆడాడు. యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరణ్‌, రవీంద్ర జడేజాను ముందుగా పంపించాడు. చాలామంది దీనిని మహీ అద్భుత వ్యూహంగా విశ్లేషించారు. రాజస్థాన్‌ చేతిలో ఓటమి తర్వాత అతడు అసలు కారణం చెప్పాడు.

షార్జా వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమి పాలైంది. స్మిత్‌ బృందం నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో ధోనీ సేన 16 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ధోనీ క్రీజులోకి వచ్చినప్పటికీ ఆఖరి వరకు షాట్లేమీ బాదలేదు. అతడిలో మునుపటి ఊపూ కనిపించలేదు. కేవలం సింగిల్స్‌కే పరిమితం అయ్యాడు. ఇక గెలవడం కష్టమని తెలిశాక.. ఆఖరి ఓవర్లో మాత్రం మూడు సిక్సర్లు కొట్టాడు. 14 రోజుల క్వారంటైన్‌ తన సన్నద్ధతపై ప్రభావం చూపించిందని ధోనీ అంటున్నాడు. సాధనకు అవసరమైన సమయం దొరకలేదని పేర్కొన్నాడు. అందులోనూ ఏడాది కాలం బ్యాటు పట్టుకోకపోవడంతో దిగువ ఆర్డర్‌లో వస్తున్నానని నిజం చెప్పేశాడు. చెన్నై శిబిరంలో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మందికి కొవిడ్‌-19 సోకడంతో ఎక్కువ రోజులు ఏకాంతంలోనే ఉన్న సంగతి తెలిసిందే.

‘217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే మాకు శుభారంభం అవసరం. కానీ అది దక్కలేదు. స్టీవ్‌ స్మిత్‌, సంజు శాంసన్‌ అద్భుతంగా ఆడారు. రాజస్థాన్‌ బౌలర్లనూ మెచ్చుకోవాల్సిందే. తొలి ఇన్నింగ్స్‌ చూశాక బంతుల్ని ఏ లెంగ్తుల్లో వేయాలో తెలుస్తుంది. వారి స్పిన్నర్లూ రాణించారు. బ్యాట్స్‌మెన్‌కు దూరంగా బంతులు విసిరారు. మా వాళ్లు మాత్రం తప్పులు చేశారు. ఎక్కువగా ఫుల్‌ లెంగ్త్‌ బంతులు విసిరారు. రాజస్థాన్‌ను 200 స్కోరుకే నియంత్రిస్తే మ్యాచ్‌ మరోలా ఉండేది’ అని ధోనీ అన్నాడు. కాగా ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ కాకుండా మరికొన్ని రోజుల తర్వాత ఆడేందుకు సీఎస్‌కేకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. మహీయే ఆ ప్రతిపాదనను కాదన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.