close

తాజా వార్తలు

Published : 26/02/2021 16:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా పేసర్‌

ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా మీడియం పేసర్‌ ఆర్‌ వినయ్‌ కుమార్‌ అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సచిన్‌ తెందుల్కర్‌, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం తన అదృష్టమని అన్నాడు. వీడ్కోలు సులువైన విషయం కాదని, కానీ ప్రతి ఆటగాడి జీవితంలో ఇది వస్తుందని ట్విటర్‌లో వినయ్‌ తెలిపాడు. ‘‘25 ఏళ్లుగా పరిగెత్తిన దావంగిరి ఎక్స్‌ప్రెస్‌..  క్రికెట్‌ జీవితంలో ఎన్నో స్టేషన్లను దాటి నేడు చివరికి ‘రిటైర్మెంట్‌’ అనే స్టేషన్‌కు చేరుకుంది. ఎన్నో మిశ్రమ భావోద్వేగాలతో అంతర్జాతీయ, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. ఇది తేలికైన నిర్ణయం కాదు. కానీ ప్రతి ఆటగాడి జీవితంలో ఈ రోజు వస్తుంది’’ అని పేర్కొన్నాడు.

37 ఏళ్ల వినయ్‌ భారత్‌ తరఫున ఒక టెస్టు, 31 వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడాడు. 49 వికెట్లు తీశాడు. కర్ణాటక జట్టు వరుసగా రెండు రంజీ ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కర్ణాటకలోని దావంగిరి జిల్లాలో అతడు జన్మించాడు. 2013లో టీమిండియా తరఫున ఆఖరిగా ప్రాతినిధ్యం వహించిన అతడు 2018లో కోల్‌కతా తరఫున చివరిగా ఐపీఎల్‌ ఆడాడు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని