Team India: టీమిండియా హెడ్‌కోచ్‌ నియామకానికి దరఖాస్తు చేసుకున్న రాహుల్‌ ద్రవిడ్!

తాజా వార్తలు

Updated : 26/10/2021 17:49 IST

Team India: టీమిండియా హెడ్‌కోచ్‌ నియామకానికి దరఖాస్తు చేసుకున్న రాహుల్‌ ద్రవిడ్!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా ప్రధాన కోచ్‌ నియామకానికి భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి. కోచ్‌గా ద్రవిడ్ నియామకం అయితే.. జాతీయ క్రికెట్‌ అకాడమీ బాధ్యతలను టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌ చేపట్టే అవకాశముందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ‘అవును. టీమిండియా హెడ్‌కోచ్‌ పదవి కోసం రాహుల్‌ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలను వీవీఎస్‌ లక్ష్మణ్ కచ్చితంగా అందుకుంటాడు. చర్చలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం’ అని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత హెడ్‌కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. దీంతో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

బెంగళూరులో ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా కొనసాగుతున్న రాహుల్‌ ద్రవిడ్..ఎంతో మంది యువ క్రికెటర్లను భారత జట్టుకు అందించాడు. దీంతో ఇతడు టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉంటే భారత క్రికెట్‌కు మరింత మేలు జరుగుతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు ఆశిస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని