Rahul Dravid:అతడిని చూస్తే భయమేసేది: పృథ్వీ షా 
close

తాజా వార్తలు

Published : 25/05/2021 19:47 IST

Rahul Dravid:అతడిని చూస్తే భయమేసేది: పృథ్వీ షా 

(photo:Prithvi Shaw Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాహుల్‌ ద్రవిడ్.. ఆటగాడిగా టీమ్‌ఇండియాకు ఎన్నో విజయాలను అందించి, అందరి మన్ననలు పొందాడు. రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత అతనికి ఆటపై మక్కువ తగ్గలేదు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) చీఫ్‌గా కొనసాగుతూ యువ ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తించి వారిని ‘జాతిరత్నాలు’గా మలచుతున్నాడు. టీమ్‌ఇండియా తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్న క్రికెటర్లలో చాలామంది ద్రవిడ్ శిష్యులే. టీమ్‌ఇండియా యువ ఆటగాడు, 2018 అండర్‌ 19 ప్రపంచకప్‌నకు కెప్టెన్‌గా ఉండి భారత్‌ను విజేతగా నిలిపిన  పృథ్వీ షా కూడా ‘ది వాల్‌’ శిష్యుడే. 2018 భారత అండర్‌ 19 జట్టుకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.


ఆయనతో కలిసి భోజనం చేయాలంటే ఆటగాళ్లకు కాస్త భయం వేసేదని పృథ్వీ షా తాజాగా చెప్పుకొచ్చాడు. ‘ప్రతి ఆటగాడితో మాట్లాడటానికి ప్రాధాన్యమిస్తాడు. ఆయనలాగా ఆడాలని ఏ ఆటగాడిని కూడా  బలవంతం చేయడు. మీకు నచ్చిన విధంగా ఆడమని చెప్పేవాడు. మానసికపరమైన విషయాలు, ఆటలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఎక్కువగా మాట్లాడతాడు. చేసిన తప్పులు పదే పదే పునరావృతమైతే దగ్గరకు వచ్చి వాటి గురించి మాత్రమే చెబుతాడు. ఆయన వల్లే  అండర్‌ 19 క్రికెట్ మెరుగైందని నమ్ముతున్నా. రాహుల్‌ సర్‌ దగ్గర క్రమశిక్షణతో ఉండేవాళ్లం. మైదానంలో స్నేహపూర్వకంగా, కలుపుగోలుగా ఉండేవాడు. ఆయన మాతోపాటే కూర్చొని భోజనం చేసేవాడు. అప్పుడు మాకు కాస్త భయంగా ఉండేది. కానీ అలాంటి దిగ్గజ ఆటగాడి పక్కన కూర్చోవాలనే కల నెరవేరింది. ప్రతి యువ ఆటగాడు దానికోసం కలలు కంటాడు’ అని పృథ్వీ షా అన్నాడు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని