
తాజా వార్తలు
భారత్×ఆసీస్ మ్యాచ్‌కు అంతరాయం
ఇంటర్నెట్‌డెస్క్: బ్రిస్బేన్ వేదికగా భారత్×ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టుకు అంతరాయం కలిగింది. వరుణుడు అడ్డంకిగా మారడంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. నాలుగో రోజు ఆటలో ఇంకా 23 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఛేదన మొదలుపెట్టిన భారత్ 4/0తో నిలిచింది. క్రీజులో రోహిత్ (4), గిల్ ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్ అయిదు, శార్దూల్ నాలుగు వికెట్లతో సత్తాచాటారు. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో భారత్‌కు ఆసీస్ 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇదీ చదవండి
Tags :