Coronarelief: రాజస్థాన్‌ రాయల్స్‌ భారీ విరాళం

తాజా వార్తలు

Published : 01/05/2021 01:12 IST

Coronarelief: రాజస్థాన్‌ రాయల్స్‌ భారీ విరాళం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనాతో యావత్‌ భారతదేశం వణికిపోతోంది. ఎంతోమంది బాధితులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో క్రికెట్‌ ప్రపంచం తమవంతు సాయం చేసేందుకు ముందుకు కదులుతోంది. ఇటీవల కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పేసర్‌ కమిన్స్‌, ఆ తర్వాత ఆస్ట్రేలియన్‌ మాజీ క్రికెటర్‌ బ్రెట్‌లీ తమవంతు సాయంగా విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా తన ఉదారత చాటుకుంది. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా రూ.7.5కోట్లు విరాళంగా ప్రకటించింది. సెకండ్‌ వేవ్‌లో కరోనా మహమ్మారి బారిన పడిన ప్రజలకు తక్షణసాయంగా ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.

‘‘ఈ నిధులు సేకరించేందుకు రాజస్థాన్‌ యాజమాన్యంతో పాటు జట్టు ఆటగాళ్లు కూడా తమవంతు తోడ్పాటు అందించారు. రాజస్థాన్ సేకరించిన ఈ నిధులు దేశవ్యాప్తంగా ఆపదలో ఉన్నవారికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా రాజస్థాన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే అక్కడి నుంచే రంజిత్ బర్తాకుర్ అధ్యక్షతన ‘ఆర్ఆర్ఎఫ్’ (రాజస్థాన్‌ రాయల్స్ ఫౌండేషన్‌) ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. కరోనా వల్ల ప్రస్తుతం దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పకూలింది. కరోనా సోకిన వారికి ఆక్సిజన్‌ అందించేందుకు ఆస్పత్రులు ఎంతో కష్టపడుతున్నాయి’’ అని రాజస్థాన్‌ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. 
ఇదిలా ఉండగా.. దేశంలో పరిస్థితి మునుపంటి కంటి ప్రమాదకరంగా మారింది. కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం ఒకే రోజు 3,79,257 కొత్త కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని