IPL: కాస్త ఆటగాళ్లను అరువివ్వరూ..!

తాజా వార్తలు

Published : 28/04/2021 01:18 IST

IPL: కాస్త ఆటగాళ్లను అరువివ్వరూ..!

మిగతా ఫ్రాంఛైజీలను కోరిన రాజస్థాన్‌

దిల్లీ: వివిధ కారణాలతో నలుగురు విదేశీ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన రాజస్థాన్‌ రాయల్స్‌.. వాళ్ల ఆటగాళ్లను అరువు ఇవ్వమని మిగిలిన ప్రాంఛైజీలను కోరింది. గాయాల కారణంగా స్టోక్స్‌, ఆర్చర్‌ ఆ జట్టుకు దూరమవగా.. బబుల్‌ ఆందోళనతో లివింగ్‌స్టన్‌, పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల కారణంగా భారత్‌లోనే చిక్కుకుపోతానేమోననే భయంతో ఆండ్రూ టై తమ దేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఆ జట్టుపై గట్టి ప్రభావమే పడింది.

‘‘ఆటగాళ్లను అరువు తెచ్చుకోవడం కోసం మిగతా ఫ్రాంఛైజీలకు రాజస్థాన్‌ లేఖలు రాసింది. కానీ ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని ఆ జట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సీజన్‌లో ఇతర ఫ్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లను జట్లు అరువు తెచ్చుకునే ప్రక్రియ సోమవారం మొదలైంది. లీగ్‌ దశ ముగిసే వరకూ ఇది కొనసాగుతోంది. ఈ సీజన్‌లో రెండు కంటే తక్కువ మ్యాచ్‌లాడిన ఆటగాణ్ని ఇతర జట్లు అరువు తీసుకోవచ్చు. ఆ ఆటగాడు తన సొంత జట్టుపై మ్యాచ్‌లో ఆడకూడదు. ఇప్పటివరకూ లీగ్‌లో అయిదు మ్యాచ్‌లాడిన రాజస్థాన్‌ రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని