IPL 2021: బాలీవుడ్‌ పాటకు రాజస్థాన్‌ చిందులు
close

తాజా వార్తలు

Updated : 29/05/2021 19:32 IST

IPL 2021: బాలీవుడ్‌ పాటకు రాజస్థాన్‌ చిందులు

టోర్నీ తిరిగి కొనసాగడంపై ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల సంతోషం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. బయోబుడగలోని పలువురు ఆటగాళ్లు కరోనా వైరస్‌బారిన పడటంతో ఆ టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. దాంతో ఎంతో మంది క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశచెందారు. అయితే, తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ నేతృత్వంలో జరిగిన స్పెషల్‌ జనరల్‌ మీటింగ్‌లో ఆ టోర్నీని తిరిగి నిర్వహించడంపై నిర్ణయం తీసుకున్నారు. టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటన అనంతరం సెప్టెంబర్‌లో గతేడాదిలాగే యూఏఈలోనే ఈసారి మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించాలని తీర్మానించారు.

ఆ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించడంతో అటు అభిమానులు, ఇటు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు సంతోషం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే, రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీ చేసిన ఓ పోస్టు మాత్రం నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంది. అది వినూత్నంగా ఉండటమే కాకుండా అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని కలిగిచింది. ‘హే బేబి’ అనే బాలీవుడ్‌ సినిమాలోని ‘మస్త్‌ కలందర్‌’ పాటకు తమ ఆటగాళ్ల ముఖాలు జోడించి రాజస్థాన్‌ ట్వీట్‌ చేసింది. అందులో అక్షయ్‌ కుమార్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, షారుఖ్‌ ఖాన్‌ లాంటి హీరోలు నటించగా వారి ప్రతిరూపాలుగా కెప్టెన్‌ సంజూ శాంసన్‌, రాహుల్‌ తెవాతియా, జోస్‌ బట్లర్‌ లాంటి ఆటగాళ్లతో మార్ఫింగ్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. మీరూ ఓ లుక్కేసి ఐపీఎల్‌ మజాను ఆస్వాదించండి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని