టీమ్‌ఇండియాలో సైద్ధాంతిక మార్పు అవసరం

తాజా వార్తలు

Published : 15/07/2021 15:29 IST

టీమ్‌ఇండియాలో సైద్ధాంతిక మార్పు అవసరం

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మహిళల జట్టు నిర్భయంగా తయారవ్వడానికి ‘సైద్ధాంతిక మార్పులు’ అవసరమని ప్రధాన కోచ్‌ రమేశ్‌ పొవార్‌ అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో హర్మన్‌ప్రీత్‌ టీమ్‌ 1-2 తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన పొవార్‌ క్రికెటర్ల ఆలోచనా విధానం మారాలన్నాడు. లేదంటే జట్టు అవసరాలకు తగ్గట్లు బ్యాటింగ్‌ చేసే కొత్త ప్లేయర్లను తీసుకురావాలని చెప్పారు. సీనియర్‌ ప్లేయర్‌, కెప్టెన్‌ మిథాలి రాజ్‌ బాగా ఆడుతున్నా ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేందుకు మరో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ కావాలని తెలిపారు.

‘భారత మహిళలు జట్టు పటిష్టంగా ఆడాలి. తొలి సిరీస్‌లోనే నేను ప్లేయర్లపై ఒత్తిడి పెంచలేను. వాళ్లొక సిద్ధాంతంతో ఆడుతున్నారు. ఇప్పటికిప్పుడే అందులో మార్పులు చేయలేం. వాళ్లకేం అవసరమో అంచనా వేయాలి. మిడిల్‌ ఆర్డర్‌లో నెమ్మదిగా ఆడుతున్న వారికి పరిస్థితులను తెలియజేసి, వారితో మాట్లాడటానికి చాలా సమయం పడుతుంది. ఆధునిక క్రికెట్‌ అంటే భయంలేకుండా ఆడటమే. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే రెండే విధాలున్నాయి. ఒకటి వారిని అవసరాలకు తగ్గట్టు మల్చుకోవడం లేదా కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకోవడం. ఈ పర్యటనలో మేం కొన్ని ప్రయోగాలు చేశాం. అయితే, అవి అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. ఇక భవిష్యత్‌లో మరిన్ని కొత్త ప్రయోగాలు చేయాలి. కొత్త వారిని తీసుకొచ్చి అనుకూలంగా మార్చుకోవాలి’ అని వివరించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని