Ashwin:సూర్యకుమార్‌.. ‘ఆకాశమే హద్దు’
close

తాజా వార్తలు

Published : 29/05/2021 01:41 IST

Ashwin:సూర్యకుమార్‌.. ‘ఆకాశమే హద్దు’

(photo: Ravichandran Ashwin Twitter)

 

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడుపుతున్నాడు. ముఖ్యంగా కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ట్విటర్‌ వేదికగా పోస్టులు పెడుతున్నాడు. అంతేకాకుండా ఇతర ఆటగాళ్లు పెట్టిన పోస్టులకు సైతం తనదైన శైలిలో స్పందిస్తున్నాడు. ట్విటర్‌లో అశ్విన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. కోటి ముప్పై లక్షల మంది అశ్విన్‌ను అనుసరిస్తున్నారు.

 

(photo:Suryakumar Yadav Twitter)

ఇక ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా ముంబయి ఇండియన్స్‌ తరఫున అదరగొడుతున్న  సూర్యకుమార్‌.. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా నుంచి అరంగేట్రం చేశాడు. అయితే, తాజాగా సూర్యకుమార్ యాదవ్‌  ట్విటర్‌లో అశ్విన్‌ ఫాలోవర్‌గా మారాడు. దీనికి అశ్విన్ ఆసక్తికరంగా కామెంట్ చేశాడు. తనను ఫాలో అవడం ఆనందంగా ఉందంటూ ‘స్కై ఈజ్‌ ద లిమిట్‌’(ఆకాశమే హద్దు) అని అశ్విన్‌ కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్  వెనుక మరో అర్థం ఉంది. అభిమానులు, సహచర ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌ పేరులోని ఆంగ్ల అక్షరాలను ఆధారంగా చేసుకుని సంక్షిప్తంగా  స్కై(SKY) అని పిలుస్తుంటారు.

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్‌ తలపడనున్న విషయం తెలిసిందే. అనంతరం ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా ఐదు టెస్టులు ఆడనుంది. ఈ సుదీర్ఘ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కించుకున్నాడు.

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని