Cricket News: కోహ్లీసేనలో జడ్డూనే బెస్ట్‌

తాజా వార్తలు

Published : 07/06/2021 10:55 IST

Cricket News: కోహ్లీసేనలో జడ్డూనే బెస్ట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత జట్టులో రవీంద్ర జడేజా అత్యంత విలువైన ఆటగాడని పాక్‌ మాజీ ఆటగాడు డానిష్‌ కనేరియా అన్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో అతడు అత్యంత కీలకం అవుతాడని చెప్పాడు. కీలక సమయాల్లో వికెట్లు తీయగల, పరుగులు చేయగల సామర్థ్యం అతడికి ఉందని ప్రశంసించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు కనేరియా తన యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడాడు.

‘ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బౌలర్లు కీలక పాత్ర పోషిస్తారు. వాళ్లు వికెట్లు తీస్తేనే మనం మ్యాచ్‌లు గెలవగలం. ఇక రవీంద్ర జడేజా గురించి చెప్పాలంటే అతడో 3డీ ఆటగాడు. అలాంటి క్రికెటర్‌ను పక్కన పెట్టేయడం సులభం కాదు. అతడు కచ్చితంగా ఆడాల్సిందే’ అని కనేరియా అన్నాడు.

‘జడ్డూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తాడు. లోయర్‌ ఆర్డర్‌లో పరుగులు చేస్తాడు. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతాడు. ఇక మెరుపు ఫీల్డింగ్‌తో ఒకట్రెండు రనౌట్లు చేయగలడు. అందుకే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌లో అతడే అత్యంత విలువైన ఆటగాడు’ అని కనేరియా తెలిపాడు.

హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌, యుజ్వేంద్ర చాహల్‌ రావడంతో రవీంద్ర జడేజాకు జట్టులో చోటు లేకుండా పోయింది. రెండేళ్లు అతడు పరిమిత ఓవర్ల క్రికెట్లో సరైన అవకాశాలు లభించక బాధపడ్డాడు. టెస్టు జట్టులో ఉన్నప్పటికీ రిజర్వు బెంచీపైనే ఉండేవాడు. ఎప్పుడైతే వెన్నెముక గాయంతో పాండ్య దూరమయ్యాడో జడ్డూ కీలకంగా మారాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 10 మ్యాచుల్లో 469 పరుగులు చేశాడు. బంతితో 28 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం కివీస్‌తో ఫైనల్‌కు సిద్ధమవుతున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని