WTC Finals: టీమ్‌ఇండియా కొత్త జెర్సీ చూశారా? 

తాజా వార్తలు

Published : 29/05/2021 16:31 IST

WTC Finals: టీమ్‌ఇండియా కొత్త జెర్సీ చూశారా? 

1990ల నాటి లుక్‌తో రవీంద్ర జడేజా ఫొటో..

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీ తుది అంకానికి చేరింది. మరికొద్ది రోజుల్లో టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఆ రసవత్తర పోరులో తలపడనున్నాయి. జూన్‌ 18 నుంచి సౌథాంప్టన్‌ వేదికగా జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ఇరు జట్లూ కొత్త జెర్సీలతో దర్శనమిచ్చే అవకాశం ఉంది. అయితే, కొద్దిసేపటి క్రితమే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టీమ్‌ఇండియా జెర్సీ ఎలా ఉండనుందో అభిమానులకు బహిర్గతం చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ పేరుతో ఉన్న ఆ జెర్సీ అచ్చం 1990ల నాటి జెర్సీలా ఆకట్టుకుంటోంది. అది అభిమానులకు ఎంతగానో నచ్చింది. జడేజా సైతం ఆ జెర్సీ ఫొటోను పంచుకొని ‘రివైండ్‌ టు 90s’ అని వ్యాఖ్యానం జతచేశాడు.

మరోవైపు ఈ సౌరాష్ట్ర క్రికెటర్‌ ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌ సందర్భంగా గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో సుమారు మూడు నెలలు విశ్రాంతి తీసుకొని పూర్తిగా కోలుకున్నాడు. ఇటీవలే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున పునరాగమనం చేసి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఓ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. హర్షల్‌ పటేల్ వేసిన ఆ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఏకంగా 5 సిక్సులు, ఒక బౌండరీతో మొత్తం 37 పరుగులు రాబట్టాడు. దాంతో ఆ మ్యాచ్‌లో జడ్డూ 28 బంతుల్లో 62 పరుగులు సాధించి తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని చెప్పకనే చెప్పాడు. ఈ క్రమంలోనే మళ్లీ టీమ్‌ఇండియాకు ఎంపికై ఇంగ్లాండ్‌ పర్యటనకు సిద్ధమయ్యాడు. జడేజా టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లోనూ కచ్చితంగా ఆడే ఆల్‌రౌండర్‌గా కనిపిస్తున్నాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని