RR Vs RCB: బెంగళూరు లక్ష్యం 150

తాజా వార్తలు

Updated : 29/09/2021 21:34 IST

RR Vs RCB: బెంగళూరు లక్ష్యం 150

ఇంటర్నెట్‌ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్‌ (58; 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశస్వీ జైస్వాల్‌ (31; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆరంభంలో రాజస్థాన్‌ దూకుడుగా ఆడినప్పటికీ.. తర్వాత వరుస వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది.

తొలుత టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌ దిగిన రాజస్థాన్‌ ఓపెనర్లు లూయిస్‌, జైస్వాల్‌ జట్టుకు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 77 పరుగులు చేశారు ఈ క్రమంలో డేనియల్‌ క్రిస్టియన్‌ వేసిన 8.2 బంతికి జైస్వాల్‌.. సిరాజ్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. జార్జ్‌ గార్టన్‌ వేసిన 12వ ఓవర్‌లో ఎవిన్‌ లూయిస్‌ శ్రీకర్ భరత్ చేతికి చిక్కాడు. ఆ తర్వా వచ్చన సంజూ శాంసన్‌ (19) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. మహిపాల్ లోమ్రోర్ (3), రాహుల్‌ తెవాటియా (2), లివింగ్‌ స్టోన్‌ (6), రియాన్‌ పరాగ్‌ (9), మోరిస్‌ (14) నిరాశపర్చారు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ మూడు, చాహల్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్‌ గార్టన్‌, క్రిస్టియన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. చివరి ఓవర్లో బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. రియాన్ పరాగ్‌, క్రిస్ మోరిస్‌ని వరుస బంతుల్లో పెవిలియన్‌కి పంపించాడు. చివరి బంతికి మరో వికెట్‌ తీశాడు. దీంతో ఒకే ఓవర్లో రాజస్థాన్ మూడు వికెట్లు కోల్పోయింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని