రికీ కవ్వింపు.. హహ్హహ్హ అన్న పంత్‌!
close

తాజా వార్తలు

Updated : 09/03/2021 04:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రికీ కవ్వింపు.. హహ్హహ్హ అన్న పంత్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి పనిచేసేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా మాజీ సారథి, డీసీ కోచ్‌ రికీ పాంటింగ్‌ అంటున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసులో అదరగొట్టిన దిల్లీ కుర్రాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌ 2021 షెడ్యూలు రావడంతో ట్వీట్‌ చేశాడు. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా షెడ్యూలును పాలక మండలి ఆదివారం విడుదల చేసింది. ఏప్రిల్‌ 9న మొదలవుతున్న పొట్టి క్రికెట్‌ వేడుక మే 30న ముగుస్తుంది. ఈసారి లీగ్‌ భారత్‌లోనే జరుగుతుండటం గమనార్హం. ఆరు తటస్థ వేదికల్లో మ్యాచులు నిర్వహిస్తారు. కాగా దిల్లీ క్యాపిటల్స్‌ సభ్యులైన రిషభ్‌ పంత్, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రస్తుతం అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

‘దిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూడలేకపోతున్నా. గత నెలలో అన్ని వికెట్లు పడగొట్టిన తర్వాతా అశ్విన్‌, అక్షర్‌కు కొన్ని వికెట్లు మిగిలే ఉన్నాయని అనుకుంటున్నా. ఇక రిషభ్‌ పంత్‌ చేసేందుకు మరిన్ని పరుగులు ఉన్నాయి!’ అని రికీ పాంటింగ్‌ ట్వీట్‌ చేశాడు. ఇందుకు పంత్‌ సైతం సరదాగా బదులిచ్చాడు. ‘హ..హ..హ.. మీ కోసం ఎదురుచూస్తున్నా రికీ’ అంటూ ట్వీటాడు. కాగా గత సీజన్లో దిల్లీ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని