చరిత్ర సృష్టించిన రిషభ్‌పంత్‌ 
close

తాజా వార్తలు

Published : 07/05/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చరిత్ర సృష్టించిన రిషభ్‌పంత్‌ 

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ చరిత్ర సృష్టించాడు. పురుషుల బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్న తొలి టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌గా ఘనత సాధించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ కొద్దిసేపటి క్రితం పంత్‌ను ప్రశంసించింది. చాలా కాలం ఫామ్‌ కోల్పోయి బ్యాటింగ్‌లో ఎన్నో వైఫల్యాలు చవిచూసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అతడు ఇటీవల టెస్టు క్రికెట్‌లో అత్యద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చోటు కోల్పోయిన పంత్‌ తర్వాత టెస్టు సిరీస్‌లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చి పలు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దాంతో టీమ్‌ఇండియా బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఆపై స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ ఆఖరి మ్యాచ్‌లో శతకంతో మెరిశాడు. దాంతో టీమ్‌ఇండియా వరుసగా రెండో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకొని ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో అర్హత సాధించింది. ఈ క్రమంలోనే అందరి చేతా ప్రశంసలు అందుకున్న పంత్‌ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ సాధించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని