ఇంట్లో వాళ్లు తొందరపెడుతున్నారు: పంత్‌
close

తాజా వార్తలు

Updated : 29/01/2021 11:31 IST

ఇంట్లో వాళ్లు తొందరపెడుతున్నారు: పంత్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని వచ్చినప్పటి నుంచి తనని ఓ విషయంలో ఇంట్లోవాళ్లు తొందరపెడుతున్నారని టీమ్‌ఇండియా యువ హీరో రిషభ్‌పంత్‌ అన్నాడు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్‌ చారిత్రక విజయం సాధించడంలో పంత్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు గతవారం తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. 

‘నేను ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి.. ఇప్పుడైనా కొత్త ఇల్లు తీసుకోమని మా ఇంట్లోవాళ్లు వెంటపడుతున్నారు. అందుకోసం గురుగ్రామ్‌ బాగుంటుందా? లేదా వేరే ఏదైనా మంచి ప్రదేశం ఉంటే చెప్పండి’ అని అభిమానులను అడిగాడు. కాగా, పంత్‌ పోస్టుకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముంబయి, నోయిడా, కాన్పూర్‌, ముజఫర్‌నగర్‌ ఇలా అనేక ప్రదేశాలు బాగున్నాయని అభిమానుల నుంచి కామెంట్లు వచ్చాయి.

కాగా, పంత్‌ ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు నామినేషన్లలో ఉన్నాడు. ఆసీస్‌ పర్యటనలో అతడితో పాటు అద్భుత ప్రదర్శన చేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ సిరాజ్‌, నటరాజన్‌లు సైతం ఆ అవార్డు రేసులో నిలిచారు. వీళ్లంతా టీమ్‌ఇండియా విజయంలో తమవంతు పాత్ర పోషించారు.

ఇవీ చదవండి..
నాలుగు వేళ్లతో బ్యాట్‌ పట్టుకున్నా
అరంగేట్రం ముందు రాత్రి నిద్రమాత్ర వేసుకున్న గిల్‌!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని