Rishabh Pant: పంత్‌ది సెహ్వాగ్‌ లాంటి ఎఫెక్ట్‌

తాజా వార్తలు

Published : 05/06/2021 11:02 IST

Rishabh Pant: పంత్‌ది సెహ్వాగ్‌ లాంటి ఎఫెక్ట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీరేంద్ర సెహ్వాగ్‌, గిల్‌క్రిస్ట్‌ ప్రత్యర్థి జట్లపై చూపించిన ప్రభావమే రిషభ్ పంత్‌ చూపిస్తున్నాడని టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. అతడు అంచెలంచెలుగా ఎదుగుతున్నాడని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ వల్ల వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ ఎంతోమంది బయటకు వచ్చారన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ కీపర్లలో సాహా ఒకడని ప్రశంసించాడు. ఫిట్‌నెస్‌ ఉన్నంత వరకు క్రికెట్‌ ఆడతానని స్పష్టం చేశాడు. క్రికెట్‌ వ్యాఖ్యానం చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు.

‘రిషభ్‌ పంత్‌ జట్టుకు ఫ్లెక్సిబిలిటీ తీసుకొస్తాడు. అవసరం మేరకు అదనపు బౌలర్‌ లేదా బ్యాట్స్‌మన్‌ను తీసుకొనేందుకు జట్టు యాజమాన్యానికి అవకాశం దొరుకుతుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే అతడు ప్రత్యర్థి మనసులో భయం పెంచుతాడు. వీరేంద్ర సెహ్వాగ్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ప్రత్యర్థిపై చూపించిన ప్రభావమే అతడూ చూపిస్తున్నాడు’ అని కార్తీక్‌ అన్నాడు.

తన కెరీర్‌ సాగిన తీరుకు గర్వపడతానని డీకే తెలిపాడు. జట్టులో దొరికిన ప్రతి అవకాశాన్నీ ఆస్వాదించానని పేర్కొన్నాడు. ప్రస్తుతం దేశానికి ఆడకముందే కుర్రాళ్లు పరిణతి సాధిస్తున్నారని వెల్లడించాడు. ఐపీఎల్‌లో వారు అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడటమే ఇందుకు కారణమని వివరించాడు. లీగ్‌ వల్ల ప్రతిభావంతులైన వికెట్‌ కీపర్లు బయటకు వచ్చారని తెలిపాడు.

ఇప్పుడు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ కాకుండా బ్యాట్స్‌మెన్‌ వికెట్‌ కీపర్లు తయారవుతున్నారని కార్తీక్‌ వివరించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్‌ కీపర్లలో సాహా ఒకడని ప్రశంసించాడు. రిషభ్‌ పంత్‌ అద్భుత బ్యాటింగ్‌ మెరుపులతో సాహాకు చోటు దొరకడం లేదని అభిప్రాయపడ్డాడు. ఇతర దేశాల్లో వీడ్కోలు తీసుకోకముందే వ్యాఖ్యానం చేస్తుంటారని తెలిపాడు. అందుకే తానూ కామెంటరీ చేయబోతున్నానని వివరించాడు. ఫిట్‌నెస్‌ ఉన్నంత వరకు క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని