close

తాజా వార్తలు

Published : 21/01/2021 14:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధోనీతో పోల్చడం అద్భుతమే కానీ.. 

భారత్‌కు చేరుకున్న పంత్‌ ఏమన్నాడంటే..?

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీతో తనని పోల్చడం సరికాదని యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా నుంచి గురువారం ఉదయం దిల్లీకి చేరుకున్న అతడు మీడియాతో మాట్లాడాడు. ధోనీలాంటి దిగ్గజ ఆటగాడితో తనని పోల్చడం అద్భుతమని అన్నాడు. అయితే.. జట్టులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని పంత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. తనను ఎవరితోనూ పోల్చవద్దని కోరాడు. ఇక కంగారూల గడ్డపై మరోసారి 2-1 తేడాతో చారిత్రక విజయం సాధించడం ద్వారా టీమ్‌ఇండియా ఆటగాళ్లందరూ సంతోషంగా ఉన్నారన్నాడు. 

కాగా, జట్టులోకి వచ్చినప్పటి నుంచీ అనేక మంది పంత్‌ను ధోనీతో పోలుస్తున్నారనే విషయం తెలిసిందే. వికెట్‌ కీపర్‌గా, ఫినీషర్‌గా ఈ యువ క్రికెటర్‌ మాజీ సారథి స్థానాన్ని భర్తీ చేయాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ధోనీ 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత జట్టుకు దూరమవడంతో పంత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, పంత్‌ కొద్దికాలం ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో రెండు కీలక ఇన్నింగ్స్‌ ఆడిన యువ బ్యాట్స్‌మన్‌.. ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. సిడ్నీ టెస్టులో 97 పరుగులు, గబ్బాలో 89* పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే పలువురు అభిమానులు మళ్లీ అతడిని ధోనీతో పోలుస్తున్నారు. 

ఇవీ చదవండి..
శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
రిషభ్‌ పంత్ కాదు.. స్పైడర్‌ పంత్‌: ఐసీసీ



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని