
తాజా వార్తలు
ధోనీతో ‘స్పైడర్ పంత్’: 40లక్షల ఫాలోవర్స్
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన భారత ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. తమ బిజీబిజీ షెడ్యూల్లో దొరికిక ఈ కాస్త విరామాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే యువవికెట్ కీపర్ రిషభ్ పంత్ మాజీ సారథి ఎంఎస్ ధోనీతో కలిసి సందడి చేశాడు. దీనికి సంబంధించిన చిత్రాన్ని ధోనీ సతీమణి సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలో సన్నిహితులతో ధోనీ, సాక్షి వీడియో కాల్లో మాట్లాడుతుండగా పంత్ చిరునవ్వుతో వాళ్లని పలకరిస్తున్నాడు.
కాగా, పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా తనకి మద్దతిస్తున్న అభిమానులకు అతడు ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో పంత్ వివిధ జెర్సీలు ధరించిన ఫొటోలు ఉన్నాయి. టీమిండియా టెస్టు, పరిమిత ఓవర్ల ఫార్మాట్ జెర్సీలు, దిల్లీ క్యాపిటల్స్ జెర్సీలతో పాటు స్పైడర్ మ్యాన్ జెర్సీ ఉండటం గమనార్హం.
గబ్బా టెస్టులో పంత్ హిందీ వెర్షన్లో స్పైడర్ మ్యాన్ పాటను పాడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అప్పటినుంచి పంత్‌ను ‘స్పైడర్ పంత్’గా నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. గబ్బా టెస్టు విజయానంతరం మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం పంత్‌ను స్పైడర్ మ్యాన్ అంటూ కొనియాడటం గమనార్హం. దీంతో పంత్ ఇలా.. ‘స్పైడర్ పంత్’గా మారిపోయాడు.
ఇదీ చదవండి
దాదా కాల్ చేశాడు.. క్రెడిట్ ద్రవిడ్‌కే: రహానె
అంచనాలు వద్దు.. ఒత్తిడి పెంచొద్దు: గంభీర్