పంత్‌ చిన్నప్పటి నుంచి మార్చుకోలేదేమో!
close

తాజా వార్తలు

Updated : 29/01/2021 13:15 IST

పంత్‌ చిన్నప్పటి నుంచి మార్చుకోలేదేమో!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ను నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన సంతకాన్ని మార్చుకోలేదని ఆటపట్టిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్‌(274)  టీమ్‌ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే గబ్బా టెస్టులో 89* పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దాంతో ఒక్కసారిగా హీరోగా మారిన పంత్‌ తాజాగా ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌కు గురయ్యాడు. అదేంటో మీరే తెలుసుకోండి.

గబ్బా టెస్టుతో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ కెరీర్‌లో కీలక మైలురాయి చేరుకున్నాడు. అది అతడికి వందో టెస్టు. కంగారూ జట్టు తరఫున ఈ ఘనత సాధించిన 13వ ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని టీమ్‌ఇండియా ఆటగాళ్లు లైయన్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆటోగ్రాఫ్‌లు చేసిన ఒక జెర్సీని ఆసీస్‌ స్పిన్నర్‌కు అందజేశారు. తాజగా, ఐసీసీ ఆ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అయితే ఆ జెర్సీపై పంత్‌ చేసిన సంతకం చిన్నపిల్లలు చేసే విధంగా ఉందని పలువురు ట్రోలింగ్‌ చేస్తున్నారు. పంత్‌ చిన్నప్పటి నుంచి సంతకాన్ని మార్చుకోలేదని కామెంట్లు పెడుతున్నారు. అలాగే తన సంతకం చివరన స్మైలీ ఎమోజీ జతచేయడంతో నెటిజన్లు మీమ్స్‌తో నవ్వుకుంటున్నారు.

ఇవీ చదవండి..
దోషిగా తేలిన శ్రీలంక మాజీ ఆటగాడు
ఇక్కడివాడే.. కంగారూ గడ్డపై!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని