పంత్‌కే చోటు.. రహానెతో పటిష్ఠ బంధం: కోహ్లీ

తాజా వార్తలు

Published : 05/02/2021 02:23 IST

పంత్‌కే చోటు.. రహానెతో పటిష్ఠ బంధం: కోహ్లీ

చెన్నై: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌కే అవకాశం ఇస్తున్నామని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె తనకు గొప్ప సహచరుడని వెల్లడించాడు. మైదానంలోనే కాకుండా బయటా తమ మధ్య చక్కని అనుబంధం ఉందని స్పష్టం చేశాడు. దేశంలో జరిగే పరిణామాలపై జట్టు సభ్యులందరం అభిప్రాయాలు పంచుకుంటామని తెలిపాడు. తొలి టెస్టుకు ముందు విరాట్‌ మీడియాతో మాట్లాడాడు.

పంత్‌కే చోటు

‘తొలి టెస్టులో రిషభ్ పంత్‌కే అవకాశం ఇస్తున్నాం. అతనిప్పుడు మానసికంగా చాలా బాగున్నాడు. చక్కగా ఆడుతున్నాడు. అన్ని విధాలుగా తన ఆటను మెరుగు పర్చుకొనేందుకు కష్టపడుతున్నాడు. పంత్‌ ఆస్ట్రేలియాలో అద్భుతంగా ఆడాడు. ఇకమీదటా అలాగే ఆడతాడన్న నమ్మకం అతడి ఇన్నింగ్స్‌లు కలిగించాయి. జట్టు అత్యంత సమతూకంగా ఉంది. బ్యాటింగ్‌ చేయగల బౌలర్లపైనే దృష్టి పెడుతున్నాం’ అని కోహ్లీ అన్నాడు. సిడ్నీ టెస్టులో 97, బ్రిస్బేన్‌లో 89*తో పంత్‌ దుమ్మురేపిన సంగతి తెలిసిందే.

రహానెతో పటిష్ఠ బంధం

టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె తనకు మధ్య మంచి అనుబంధం ఉందని కోహ్లీ తెలిపాడు. తామిద్దరం పరస్పరం ఎంతో నమ్మకంగా ఉంటామని పేర్కొన్నాడు. ‘నేను, జింక్సే కాదు జట్టులో అందరి మధ్యా అనుబంధం, నమ్మకం బాగుంటుంది. రహానె ఆస్ట్రేలియాలో తనకు అప్పగించిన కర్తవ్యాన్ని గర్వంగా పూర్తి చేశాడు. దేశం గర్వపడేలా జట్టును నడిపించాడు. అతడు జట్టును విజయం వైపు నడిపించినందుకు సంతోషంగా ఉంది. అదే మా లక్ష్యం’ అని కోహ్లీ అన్నాడు.

‘జింక్స్‌, నేను పరస్పరం మా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తాం. మైదానంలో మేమెంతో గౌరవంగా ఉంటామన్న సంగతి తెలిసిందే. మైదానం ఆవలా మా మధ్య అనుబంధం బాగుంటుంది. బాగా మాట్లాడుకుంటాం. నిరంతరం అందుబాటులో ఉంటాం. మాది నమ్మకంపై ఆధారపడ్డ బంధం. మ్యాచులో అవసరమైనప్పుడు చక్కని సలహాలు ఇవ్వగల సామర్థ్యం అతడికుంది. మ్యాచు ఎటువైపు వెళ్తుందో మేమిద్దరం చర్చించుకుంటాం. జట్టు ప్రణాళికలపై నేనెప్పుడూ అతడిని సంపద్రిస్తూనే ఉంటాను. అలా మేమిద్దరం కలిసి పనిచేస్తాం. టెస్టు క్రికెట్లో జట్టు విజయానికి కారణమిదే. జట్టును ముందుకు తీసుకెళ్లాలన్న తాపత్రయంతో మేముంటాం’ అని విరాట్‌ అన్నాడు.

ఇవీ చదవండి
సెహ్వాగ్‌ లాగే పంత్‌ భయపెట్టిస్తాడు 
క్రిస్‌గేల్‌ 22 బంతుల్లో 84 పరుగులు

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని