రోహిత్ 97.. రితికా గుండె లబ్‌..డబ్‌!

తాజా వార్తలు

Published : 14/02/2021 01:39 IST

రోహిత్ 97.. రితికా గుండె లబ్‌..డబ్‌!

తాను చూస్తుండగా భర్త శతకం సాధిస్తే ఏ భార్యకు మాత్రం ఆనందంగా ఉండదు చెప్పండి! ఇంగ్లాండ్‌పై రెండో టెస్టులో రోహిత్‌ శర్మ శతకం బాదేశాక రితికా సజ్దెదీ ఇదే పరిస్థితి. ఒక్కసారిగా ఆమె పరవశానికి గురైంది. భావోద్వేగం చెందింది. హిట్‌మ్యాన్‌ 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు మాత్రం ఆమె గుండెలయ అదుపుతప్పింది! లబ్‌..డబ్‌.. అంటూ వేగంగా కొట్టుకోసాగింది. చేతివేళ్లు బిగపట్టుకొని మరీ మ్యాచ్‌ చూసింది.

చెపాక్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్‌ పరుగుల వరద పారించాడు. 231 బంతుల్లో 161 పరుగులు చేశాడు. 18 బౌండరీలు 2 సిక్సర్లు బాదేశాడు. జట్టులో మిగతా సహచరులు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో సునాయసంగా శతకం చేసేశాడు. అయితే పిచ్‌పై విపరీతంగా టర్న్‌ ఉండటం, మొయిన్‌ అలీ ప్రమాదకరంగా బంతులు వేయడంతో శతకం ముంగిట హిట్‌మ్యాన్‌ ఇబ్బంది పడ్డాడు.

రోహిత్‌ 97 పరుగుల వద్ద ఉండగా మొయిన్‌ అలీ, స్టువర్ట్‌ బ్రాడ్‌ అతడిని పరీక్షించారు. ముఖ్యంగా అలీ వేసిన బంతులను అతడు స్వీప్‌ చేసే క్రమంలో ఫీల్డర్ల ముంగిట బంతులు గాల్లోకి లేచాయి. దాదాపుగా అతడు ఔటవుతాడేమో అనిపించింది. బ్రాడ్‌ వేసిన బంతులు అతడి బ్యాటు అంచును తాకి కీపర్‌ చేతుల్లో పడుతున్నట్టుగా కనిపించాయి. దీంతో అక్కడే గ్యాలరీలో ఉన్న రోహిత్‌ సతీమణి రితికా సజ్దె ఆందోళనకు గురైంది. ఆమె హృదయస్పందన అత్యంత వేగమైంది. ఫింగర్స్‌ క్రాస్‌ చేసి కూర్చొంది. శతకం చేశాకా ఫింగర్స్‌ క్రాస్‌ చేసే కరతాళధ్వనులు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ చిత్రాలు వైరల్‌గా మారాయి. బీసీసీఐలో ఇందుకు సంబంధించిన వీడియో సైతం ఉంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌

ఇవీ చదవండి
సవాళ్లు విసిరే పిచ్‌పై దమ్మేంటో చూపిన రోహిత్‌
 కోహ్లీ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారి

 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని