ఆచితూచి ఆడుతున్న రోహిత్‌, గిల్‌
close

తాజా వార్తలు

Updated : 08/01/2021 11:15 IST

ఆచితూచి ఆడుతున్న రోహిత్‌, గిల్‌

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ(22), శుభ్‌మన్‌ గిల్(27)‌ ఆచితూచి ఆడుతున్నారు. వీరిద్దరూ పూర్తిగా డిఫెన్స్‌ ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే 20 ఓవర్లకు జట్టు స్కోరును 50/0కి తీసుకెళ్లారు. అంతకుముందు స్టీవ్‌స్మిత్‌(131) శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసింది. జడేజా 4, బుమ్రా, సైని 2, సిరాజ్ 1 వికెట్‌ తీశారు. ప్రస్తుతం భారత్‌ 288 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. 

ఇవీ చదవండి..

స్మిత్‌ శతకం.. ఆస్ట్రేలియా 338 

కోహ్లీ సరసన ‌స్మిత్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని