close

తాజా వార్తలు

Published : 16/01/2021 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రోహిత్‌ శర్మ ఆరోసారి

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నిలకడగా రాణిస్తున్నా.. ఈ ఫార్మాట్‌లో ఒకే బౌలర్‌ చేతిలో ఆరుసార్లు ఔటవడం గమనార్హం. గాయం కారణంగా తొలి రెండు టెస్టులు ఆడని హిట్‌మ్యాన్‌ మూడో టెస్టు నుంచి జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలోనే సిడ్నీ టెస్టులో (26, 52) పరుగులు చేశాడు. ఇక గబ్బాలో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో లైయన్‌ 100 టెస్టుల్లో 397 వికెట్లతో కొనసాగుతున్నాడు.

అయితే, రోహిత్‌ ఈ ఫార్మాట్‌లో అత్యధికంగా ఆరుసార్లు లైయన్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడతో సమానంగా లైయన్‌ ఐదుసార్లు టీమ్‌ఇండియా ఓపెనర్‌ను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో రోహిత్‌ను టెస్టుల్లో అత్యధిక సార్లు ఔట్‌ చేసిన బౌలర్‌గా ఈ ఆస్ట్రేలియా స్పిన్నర్‌ రికార్డు నెలకొల్పాడు. మరోవైపు లైయన్‌ ఈ మ్యాచ్‌లో ఇంకో మూడు వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా తరఫున 400 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. అతడికన్నా ముందు షేన్‌వార్న్‌(708), మెక్‌గ్రాత్‌(563) ఉన్నారు. 

ఇవీ చదవండి..
రోహిత్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన డీకే
పాండ్య సోదరులకు పితృ వియోగం..



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని