ఇది హిట్‌మ్యానా.. భజ్జీ అనుకున్నామే!

తాజా వార్తలు

Published : 06/02/2021 19:50 IST

ఇది హిట్‌మ్యానా.. భజ్జీ అనుకున్నామే!

ఇంటర్నెట్‌డెస్క్‌: చెపాక్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 555 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్ (218) ద్విశతకం సాధించాడు. అయితే రెండో రోజు ఆటలో బౌలర్లకు కాస్త విశ్రాంతిని ఇవ్వాలని భావించిన భారత సారథి విరాట్ కోహ్లీ టీ విరామానికి ముందు రోహిత్‌కు బంతిని అందించాడు. రెండు ఓవర్లు వేసిన హిట్‌మ్యాన్ ఏడు పరుగులిచ్చాడు.

అయితే రెండో సెషన్‌లో ఆఖరి ఓవర్ వేసిన రోహిత్ చివరి బంతిని టీమిండియా సీనియర్ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌లా అనుకరించి బౌలింగ్ చేశాడు. భజ్జీ శైలిలో చేతుల్ని తిప్పుతూ బంతిని విసిరాడు. రోహిత్‌ బౌలింగ్ శైలిని చూసి బ్యాటింగ్ చేస్తున్న రూట్ కూడా చిరునవ్వు నవ్వాడు. అంతేగాక హిట్‌మ్యాన్ బౌలింగ్ చేస్తుండగా వికెట్ల వెనుక ఉన్న పంత్‌ బిగ్గరగా అరుస్తూ సలహాలిచ్చాడు. దానికి రోహిత్ నవ్వుతూ ‘అలాగే సర్‌’ అని బదులివ్వడం గమనార్హం.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అలసిపోయిన సహచర ఆటగాళ్లలో జోష్‌ నింపడానికి భజ్జీలా రోహిత్‌ సరదాగా బౌలింగ్ చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బౌలింగ్ చేసేది భజ్జీనే అనుకున్నామని కొందరు ఫన్నీగా పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇవీ చదవండి

రూట్‌’ను తప్పించడం ఎందుకింత కష్టం!

సీన్‌ రిపీట్‌: ఇంగ్లాండ్‌దే పైచేయిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని