close

తాజా వార్తలు

Published : 01/03/2021 11:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాలుగో టెస్టుకు పిచ్‌ ఎలా ఉండనుందో..

రోహిత్‌ ఆశ్చర్యం..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తాజాగా పిచ్‌ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫొటో సరదాగా ఉంది. అహ్మదాబాద్‌ వేదికగా మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే నాలుగో టెస్టు గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్‌లో పిచ్‌ ఎలా ఉండనుందనే విషయంపై రోహిత్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నాలుగో టెస్టుకు సన్నద్ధమవుతున్న సందర్భంలోనే మైదానంలో పడుకొని పిచ్‌ను చూస్తున్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. ‘నాలుగో టెస్టుకు పిచ్‌ ఎలా ఉండనుందనే విషయంపై ఆశ్చర్యపోతున్నా’నంటూ దానికి వ్యాఖ్యానం జతచేశాడు.

ఇప్పటికే అక్కడ మూడో టెస్టు గెలిచిన టీమ్‌ఇండియా చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తుండగా, ఇంగ్లిష్‌ జట్టు సైతం ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ డ్రా చేసుకోవాలని తాపత్రయ పడుతోంది.

అయితే, గతవారం జరిగిన పింక్‌బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల మొతేరా పిచ్‌పై అనేక విమర్శొలొచ్చాయి. టీమ్ఇండియా తమకు అనుకూలంగా ఉండే స్పిన్‌ పిచ్‌ను రూపొందించుకుందని, టెస్టు క్రికెట్‌కు ఇలాంటి వికెట్‌ సరికాదని పలువురు మాజీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, దీనికి టీమ్‌ఇండియా ఆటగాళ్లు సైతం అంతే దీటుగా బదులిచ్చారు. రోహిత్‌ మాట్లాడుతూ విదేశాల్లో తాము క్రికెట్‌ ఆడేటప్పుడు పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై ఎప్పుడూ ఫిర్యాదులు చేయలేదని గుర్తుచేశాడు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని