ఆడపిల్ల తండ్రిగా గర్వపడుతున్నా: రోహిత్‌ శర్మ

తాజా వార్తలు

Published : 21/05/2021 01:11 IST

ఆడపిల్ల తండ్రిగా గర్వపడుతున్నా: రోహిత్‌ శర్మ

(photo:Rohit Sharma Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా ఓపెనర్‌, ముంబయి ఇండియన్స్‌ సారథి ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్ శర్మకు తన కూతురు సమైరా అంటే ఎంతో ఇష్టం. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సమైరాతో సరదాగా గడపటానికి ప్రాధాన్యమిస్తాడు రోహిత్. అందుకే టీమిండియా, ఐపీఎల్‌ మ్యాచులు ఉన్న సమయంలో రోహిత్ తనతో పాటు భార్య రితికా సజ్డెదీ, కూతురు సమైరాను వెంట తీసుకెళ్తాడు. తన కూతురుతో ఆడుకుంటున్న వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటాడు హిట్‌మ్యాన్‌.  

గురువారం కూడా తన గారాలపట్టి సమైరాను భుజాలపై ఎత్తుకుని ఉన్న ఫొటోను రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ‘ఆడపిల్ల తండ్రిగా గర్వపడుతున్నా’ అనే వ్యాఖ్యను జోడించాడు. ఈ పోస్టుకు కొన్ని గంటల్లోనే సుమారు 8 లక్షల లైక్‌లు వచ్చాయి. 2015లో తన చిన్న నాటి స్నేహితురాలు రితికా సజ్దెదీని రోహిత్‌ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు 2018లో సమైరా జన్మించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని