వార్నర్‌.. రోహిత్‌ చెప్పింది నిజమే కదా..! 
close

తాజా వార్తలు

Published : 04/04/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వార్నర్‌.. రోహిత్‌ చెప్పింది నిజమే కదా..! 

సన్‌రైజర్స్‌ కెప్టెన్‌పై హిట్‌మ్యాన్‌ కామెంట్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ముందు అన్ని జట్ల ఆటగాళ్లు ఇప్పటికే తమ ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసిన హోటల్స్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల పాటు ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయితే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ శుక్రవారమే ఆస్ట్రేలియా నుంచి చెన్నై చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా జట్టు అక్కడే బస ఏర్పటు చేసింది. దాంతో వార్నర్‌ ప్రస్తుతం తన గదిలోనే క్వారంటైన్‌లో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకొని క్వారంటైన్‌లో ఎలా గడపాలో సలహాలు, సూచనలు చేయమని వార్నర్‌ అభిమానులను కోరాడు. ‘ఐపీఎల్‌ ఆడేందుకు వచ్చాను. క్వారంటైన్‌లో ఉండడానికి సిద్ధమయ్యా. కానీ నాకు ఒకటే సమస్య ఎదురైంది. క్వారంటైన్‌లో ఉండాల్సినన్ని రోజులు ఎలా గడపాలో మీరు సలహాలివ్వండి. వాటిని కామెంట్స్‌లో పెట్టండి’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇది చూసిన రోహిత్‌ వెంటనే స్పందించాడు. ‘టిక్‌టాక్‌ మిస్‌ అవుతున్నట్లు ఉన్నావ్‌’ అంటూ తనదైనశైలిలో హాస్యం జోడించిన కామెంట్‌ చేశాడు. దీనికి నెటిజెన్ల నుంచి పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు వచ్చాయి.

కాగా, గతేడాది కరోనా వైరస్‌ వల్ల ఐపీఎల్‌ 13వ సీజన్‌ వాయిదా పడిన వేళ.. లాక్‌డౌన్‌లో వార్నర్‌ టిక్‌టాక్‌ వీడియోలు చేశాడు. తనతో పాటు భార్య క్యాండీస్‌, తన ముగ్గురు పిల్లలతో పాటు డ్యాన్సులు చేసి నెటిజెన్లకు చేరువయ్యాడు. ముఖ్యంగా టాలీవుడ్‌, బాలీవుడ్‌ పాటలు, సినిమా డైలాగులతో అలరించాడు. అయితే, కొద్ది నెలల క్రితం టిక్‌టాక్‌తో పాటు మరిన్ని చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ సరదాగా సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ను ఆటపట్టించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని