Sachin: ఆ సంఘటన నన్ను రక్తదాతగా మార్చింది
close

తాజా వార్తలు

Published : 15/06/2021 01:05 IST

Sachin: ఆ సంఘటన నన్ను రక్తదాతగా మార్చింది

ముంబయి: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సోమవారం ఓ శిబిరంలో స్వచ్ఛందంగా తన రక్తాన్ని దానం చేశాడు. ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమీప బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం దానం చేయాలని కోరాడు. ఇతరుల ప్రాణాలు కాపాడే శక్తి మనందరికీ ఉందని, దాన్ని చక్కగా ఉపయోగించుకుందామని మాజీ బ్యాట్స్‌మన్‌ పిలుపునిచ్చాడు. కాగా, తాను ఈ మంచి పనికి ఎందుకు సిద్ధపడ్డాడో కూడా సచిన్‌ వివరించాడు.

‘కొన్నాళ్ల క్రితం మా కుటుంబంలోని ఓ వ్యక్తికి రక్తం అవసరమొచ్చింది. అతనికి పెద్ద సర్జరీ జరగ్గా ఎక్కువ మొత్తంలో రక్తం కోల్పోయాడు. అది మాకు ఓ చేదు అనుభవం. అతని కోసం మేం రక్తం సేకరించే ప్రయత్నాలు చేస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి మా దగ్గరకొచ్చి తన రక్తాన్ని ఇచ్చి మా కుటుంబసభ్యుడి ప్రాణాలు కాపాడాడు. దాంతో మాకు చాలా సంతోషమేసింది. ఆ వ్యక్తికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థంకాలేదు. ఇప్పుడతనికి ధన్యవాదాలు చెబుతున్నా. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మా బృందం అంతా రక్తాన్ని దానం చేసేందుకు వచ్చాం. మేం చేసిన ఈ పని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎవరినైనా కాపాడుతుందని బలంగా నమ్ముతున్నా. మీరు కూడా ఇలాగే రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నా. ఇది ప్రజలందరికీ ఉపయోగపడే ఓ మంచి కార్యం. అందుకోసం మీరు చేయాల్సిందల్లా దగ్గర్లోని బ్లడ్‌ బ్యాంక్‌లను సంప్రదించడమే. మీరు చేసే పనికి వాళ్లెంతో సంతోషిస్తారు. దాని వల్ల అవసరమైనవారిని కాపాడినవారౌతారు’ అని సచిన్‌ వీడియోలో పేర్కొన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని