Sachin: గావస్కర్‌ మాటలు ఎంతో ఉపయోగపడ్డాయి

తాజా వార్తలు

Published : 10/07/2021 16:20 IST

Sachin: గావస్కర్‌ మాటలు ఎంతో ఉపయోగపడ్డాయి

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ నేడు 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అతనికి పలువురు క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు అందాయి. మాజీ కెప్టెన్‌ సచిన్‌ తెందూల్కర్‌ సైతం ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. గావస్కర్‌కు శుభాకాంక్షలు చెబుతూ పూర్తి ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే సచిన్‌ మాట్లాడుతూ తన కెరీర్‌ తొలినాళ్లలో ఆ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. దాంతో తన ఆట మారిందని, ఆ మాటలను తన కెరీర్‌లో ఎల్లవేళలా పాటించానని చెప్పారు.

‘మేం అనేక సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం. కానీ, నాకు గుర్తుంది మాత్రం.. తొలిసారి నేను 1990లో టీమ్‌ఇండియాకు ఆడినప్పుడు లార్డ్స్‌ టెస్టులో 27 పరుగులకే ఔటైనప్పుడు గావస్కర్‌ నా దగ్గరికొచ్చి మాట్లాడారు. బంతి సరైన లైన్లో పడకపోయినా నేను పుష్‌ చేయబోయాను. దాన్ని వదిలేయాల్సింది కానీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి రెండో స్లిప్‌లో దొరికిపోయాను. అప్పుడు నా వద్దకు వచ్చిన గావస్కర్‌ మరాఠీలో ఇలా చెప్పారు. ‘‘ఔట్‌సైడ్‌ వెళ్లే బంతిని వదిలేయాలి, శరీరానికి దగ్గరగా వచ్చే బంతులను షాట్‌ ఆడాలి’’ అని సూచించారు. తర్వాత ప్రాక్టీస్‌ సెషన్లలో ఆయన చెప్పినట్లే ప్రయత్నించాను. దాంతో ఆ మాటలు నాకు ఉపయోగపడ్డాయి. అదొక్కటే కాకుండా మేం కలిసిన ఎన్నోసార్లు అనేక విషయాలు పంచుకున్నారు. ఆయన మాకు ఎల్లప్పుడూ సహకరిస్తూనే ఉన్నారు’ అని సచిన్‌  వివరించారు. ఇదిలా ఉండగా, గావస్కర్‌ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కామెంట్రీ చేసేందుకు అక్కడికి వెళ్లిన ఆయన ఇప్పుడు ఖాళీ సమయంలో వింబుల్డన్‌ మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. అతనికి తోడుగా వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ ఉన్నాడు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని