Rahul Dravid: ద్రవిడ్‌పై ఒత్తిడి లేదు.. అదో అవకాశం

తాజా వార్తలు

Published : 05/07/2021 01:03 IST

Rahul Dravid: ద్రవిడ్‌పై ఒత్తిడి లేదు.. అదో అవకాశం

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లను భవిష్యత్‌ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడానికి శ్రీలంక పర్యటన రాహుల్‌ ద్రవిడ్‌కు మంచి అవకాశమని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కోహ్లీసేన వెంట టెస్టు జట్టుతో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లంక పర్యటనకు బీసీసీఐ ద్రవిడ్‌ను మరో కోచ్‌గా ఎంపికచేసింది. ఇప్పటికే అతడు ఇండియా ఏ, అండర్‌-19 జట్లకు కోచ్‌గా పనిచేసిన నేపథ్యంలో ఈ పర్యటనలో యువ ఆటగాళ్లు మరిన్ని విషయాలు నేర్చుకుంటారని సల్మాన్‌ అన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘ద్రవిడ్‌పై ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేదని అనుకుంటున్నా. టీమ్‌ఇండియాలోని ఆటగాళ్లను భవిష్యత్‌ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడానికి అతడికిది మంచి అవకాశమని భావిస్తున్నా. అయితే, ఈ పర్యటనలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆడాలనే అవసరం లేదు. ద్రవిడ్‌తో సమయాన్ని గడిపినా, అతడి అనుభవాలను పంచుకున్నా వాళ్ల కెరీర్‌కు ఉపయోగపడుతంది. అది ఇప్పటికే జట్టులోని చాలా మందికి అనుభవపూర్వకమై ఉంటుంది. అలాగే భారత్‌ తమ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యం కలిగిన స్పెషలిస్టులను నియమించుకుంటుంది. వాళ్లు కేవలం క్రికెట్‌ విషయాలపైనే కాకుండా సంస్థాగతంగా ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఉంటారు. అలాంటి వాళ్లు తమ జట్లను సరైన దారిలో ముందుకు తీసుకెళ్తారు. ద్రవిడ్‌ కూడా గతంలో కెప్టెన్‌గా చేశాడు. అతడు మధ్యలోనే కెప్టెన్సీ కోల్పోయినా విజయవంతమైన సారథి’ అని సల్మాన్‌ టీమ్‌ఇండియా క్రికెట్‌ గురించి ప్రశంసల వర్షం కురిపించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని