Ashwin: అశ్విన్‌ ఆల్‌ టైం గ్రేట్ కాదు: మంజ్రేకర్‌
close

తాజా వార్తలు

Published : 07/06/2021 01:11 IST

Ashwin: అశ్విన్‌ ఆల్‌ టైం గ్రేట్ కాదు: మంజ్రేకర్‌


(photo:Ravichandran Ashwin Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా టాప్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన జాబితాలో ఆల్‌ టైం గ్రేట్‌ కాదని భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా (SENA) దేశాలతో ఆడటం భారత ఆటగాళ్లకు అంత సులువు కాదని, ఈ దేశాలతో ఆడే సామర్థ్యం తమకు ఉన్నట్టు టీమ్‌ఇండియా క్రికెటర్లు ఇంకా నిరూపించుకోవాల్సి ఉందన్నాడు. ‘అశ్విన్‌ను గౌరవిస్తాను. చేసే పనిలో అతను గొప్ప వ్యక్తే. కానీ, ఆల్‌ టైం గ్రేట్‌లలో ఒకరిగా చెప్పడానికి అంగీకరించను. ఈ విషయంలో నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.

‘బ్యాట్స్‌మెన్‌, బౌలర్లకు పేరుగాంచిన సెనా దేశాల్లో భారత ఆటగాళ్లు ఇంకా కంఫర్ట్‌ జోన్‌కు అవతలి వైపే ఉన్నారు. ఈ దేశాలపై అశ్విన్‌ ఒక్కసారి కూడా ఐదు వికెట్ల ఘనత అందుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ దేశాలపై ఒక్కటంటే ఒక్క ఐదు వికెట్ల ఘనత కూడా లేదు. అశ్విన్‌ బౌలింగ్‌ విధానానికి భారత పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. అయితే, గత నాలుగేళ్లుగా రవీంద్ర జడేజా అన్ని సిరీస్‌లో అతడితో సమానంగా వికెట్లు తీస్తున్నాడు. కాబట్టి, అశ్విన్‌ ఎవరి కంటే ఎక్కువ కాదు. ఆసక్తి కలిగించించే మరో విశేషమేమిటంటే.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఒకే రకమైన పిచ్‌లపై అశ్విన్‌ కంటే అక్షర్ పటేల్ ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. అందువల్లే అశ్విన్‌ ఆల్‌ టైం గ్రేట్‌గా ఒప్పుకోను’ మంజ్రేకర్‌ చెప్పుకొచ్చాడు. అశ్విన్‌ ఇప్పటి వరకు 78 టెస్టుల్లో 409 వికెట్లు పడగొట్టి.. టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు  హర్భజన్‌ సింగ్‌, కపిల్‌దేవ్‌, అనిల్‌ కుంబ్లే ఈ జాబితాలో ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని