T20 World Cup: అదరగొట్టిన అఫ్గాన్.. స్కాట్లాండ్‌ ముందు భారీ లక్ష్యం

తాజా వార్తలు

Published : 25/10/2021 21:18 IST

T20 World Cup: అదరగొట్టిన అఫ్గాన్.. స్కాట్లాండ్‌ ముందు భారీ లక్ష్యం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్థాన్‌ అదరగొట్టింది. నజీబుల్లా జద్రాన్ (59) అర్ధ శతకంతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో అఫ్గాన్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. స్కాట్లాండ్‌ ముందు 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. స్కాట్లాండ్‌ బౌలర్లలో షరీఫ్‌ రెండు, మార్క్ వాట్‌, జోష్‌ డేవీ తలో వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు హజ్రాతుల్లా జజాయి (44), మహమ్మద్‌ షెహజాద్ (22) జట్టుకు శుభారంభం అందించారు. వేగంగా ఆడే క్రమంలో షెహజాద్ షరీఫ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహ్మానుల్లా (46)తో కలిసి మరో ఓపెనర్‌ హజ్రాతుల్లా ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే మార్క్‌ వాట్ వేసిన పదో ఓవర్లో హజ్రాతుల్లా బౌల్డయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన నజీబుల్లా జద్రాన్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌ నిలకడగా ఆడుతూ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. 19 ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రహ్మానుల్లా క్యాచ్‌ ఔటై క్రీజు వీడాడు. షరీఫ్‌ వేసిన ఆఖరి ఓవర్‌ చివరి బంతికి నజీబుల్లా జద్రాన్ ఔటయ్యాడు. ఆఖర్లో వచ్చిన కెప్టెన్‌ మహమ్మద్‌ నబీ (11) నాటౌట్‌గా నిలిచాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని