Cricket News: దాదా, గిల్‌ను శంకించడమే!

తాజా వార్తలు

Updated : 05/07/2021 11:54 IST

Cricket News: దాదా, గిల్‌ను శంకించడమే!

సాబా కరీమ్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీసీసీఐ వర్గాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బోర్డు కచ్చితమైన నిబంధనలు పాటిస్తోందని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు అన్నారు. అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. క్రికెటర్లు గాయాలను దాస్తున్నారని, ఫిజియోలు వాటిని గుర్తించడం లేదన్న సాబా కరీమ్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఇది దాదా, గిల్‌ను అవమానించడమే అవుతుందని విమర్శించారు.

‘ఈ వ్యాఖ్యలు చేస్తూ ఆయన సౌరవ్‌ గంగూలీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఆటగాళ్ల ఎంపిక, ఫిట్‌నెస్‌ అంశాల్లో కచ్చితంగా నిబంధనలు పాటించడంపై దాదా సీరియస్‌గా ఉంటారు. ఇవి తీవ్రమైన ఆరోపణలు. ఆటగాడిగా శుభ్‌మన్‌ గిల్‌, నాయకుడిగా దాదా నిజాయతీని అనుమానించడమే అవుతుంది’ అని బీసీసీఐ అధికారి అన్నారు.

‘ఇది కరీమ్‌ ఏడుపే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే కొంతకాలం క్రితం వరకూ ఆయన బీసీసీఐలో పనిచేశారు. ఒక ఆటగాడి ఫిట్‌నెస్‌ను ఎలా పరీక్షిస్తారో, ఆ ప్రక్రియ ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఈ రోజుల్లో ఆటగాళ్లు గాయాలను దాచే అవకాశమే లేదు. బహుశా అతడు క్రికెటర్‌ లేదా సెలక్టర్‌గా ఉన్నప్పుడు అలా జరిగిందేమో నాకు తెలియదు. కానీ అతడి మాటలు మాత్రం బాధాకరం’ అని ఆ అధికారి తెలిపారు.

‘ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు శుభ్‌మన్‌కు ఎలాంటి గాయం కాలేదు. బహుశా న్యూజిలాండ్ మ్యాచ్‌ అయ్యాక కావొచ్చు. ఆ కుర్రాడు ఎంతో నిజాయతీ పరుడు. టీమ్‌ఇండియా తరఫున టెస్టు, ఇతర ఫార్మాట్లలో ఆడిన సాబా కరీమ్‌ ఇలా మాట్లాడటం మాత్రం దురదృష్టకరం’ అని విమర్శించారు.

శుభ్‌మన్‌గిల్‌ గాయాన్ని దాచడం ఆశ్చర్యపరిచిందని సాబాకరీమ్‌ మీడియాతో అన్నారు. అతడు సుదీర్ఘ కాలంగా టీమ్‌ఇండియాతో ప్రయాణిస్తున్నా ఫిజియోలు, వైద్య సిబ్బంది అతడి గాయాన్ని గుర్తించలేకపోయారని విమర్శించారు. ఈ విషయం ముందే ఎందుకు తెలియలేదో ఆశ్చర్య పరిచిందన్నారు. ఆయన వ్యాఖ్యలను బీసీసీఐ వర్గాలు కొట్టిపారేశాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని