
తాజా వార్తలు
శార్దూల్.. ఏంటీ ఆవేశం!
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాపై ఆఖరి వన్డేలో విజయం సాధించిన టీమ్ఇండియా జోరుమీదుంది. ఇదే ఊపులో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. యువకుల రాకతో జట్టులో తాజాదనం కనిపించింది. ఆ మార్పులు ఫలించాయని విరాట్ కోహ్లీ సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే యువపేసర్లు శార్దూల్ ఠాకూర్ (3/51), నటరాజన్ (2/70) అదరగొట్టారు.
కాన్బెర్రా వేదికగా జరిగిన ఈ పోరులో తొలుత టీమ్ఇండియా బ్యాటింగ్ చేసింది. హార్దిక్ పాండ్య (92), రవీంద్ర జడేజా (66) అజేయంగా నిలవడంతో ఆసీస్‌కు 303 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఆరోన్ ఫించ్ (75), మాక్స్వెల్ (59) అర్ధశతకాలు బాదడంతో ఛేదనకు దిగిన కంగారూలు గెలుపు దిశగా కదిలినట్టే అనిపించింది. అయితే శార్దూల్ ఠాకూర్ కీలకమైన స్మిత్, హెన్రిక్స్‌ను తొలుత పెవిలియన్ పంపించి దెబ్బకొట్టాడు. బౌలింగ్ చేస్తున్నంత సేపు అతడు కసిగా కనిపించాడు. మోజెస్ హెన్రిక్స్(22; 31 బంతుల్లో 3×4)ను ఔట్ చేసినప్పుడు ఆవేశంతో అతడివైపే చూశాడు. కోహ్లీ వచ్చి అతడిని కూల్ చేసినట్టు అనిపించింది. ఈ పోరులో హెన్రిక్స్ వికెట్ కీలకం. ఎందుకంటే ఆరోన్ ఫించ్‌తో కలిసి అతడు విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు.
నిజానికి ఆ సమయంలో టీమ్ఇండియాకు వికెట్ ఎంతో అవసరం. కుల్దీప్, జడేజా ఎంత ప్రయత్నించినా ఈ జోడీని విడగొట్టలేకపోయారు. అప్పుడే శార్దూల్‌ను కోహ్లీ ప్రయోగించాడు. అతడు తక్కువ లెంగ్త్‌తో క్రాస్‌సీమ్ బంతిని విసిరాడు. దానిని మిడ్‌వికెట్ మీదుగా హెన్రిక్స్ పుల్చేయబోయాడు. మిస్టైమ్ అవ్వడంతో గాల్లోకి ఎగిరిన బంతిని ధావన్ అందుకున్నాడు. అప్పుడు గతానికి భిన్నంగా శార్దూల్ ఆవేశంగా హెన్రిక్స్నే చూస్తూ ఉండిపోయాడు. కోహ్లీ సహా సహచరులు వచ్చి అభినందించాకే కాస్త చల్లబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌లో కూల్‌గా ఉండే శార్దూల్.. కోహ్లీ వద్దకు రాగానే దూకుడు పెంచాడని అభిమానులు అంటున్నారు.
ఇవీ చదవండి
బుమ్రా ఇలా అయ్యాడేంటి?
జడ్డూకు హ్యాట్సాఫ్ చెప్పిన మంజ్రేకర్
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- సాహో భారత్!
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
