IPL 2021: కోల్‌కతా గెలిస్తే.. ఆ కప్‌లోనే కాఫీ తాగుతా: షారుఖ్‌ ఖాన్

తాజా వార్తలు

Updated : 15/10/2021 17:51 IST

IPL 2021: కోల్‌కతా గెలిస్తే.. ఆ కప్‌లోనే కాఫీ తాగుతా: షారుఖ్‌ ఖాన్

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తుదిపోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్కే), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) తలపడనున్నాయి. ఈ పోరులో కోల్‌కతా విజయం సాధిస్తే.. ఆ కప్‌లోనే కాఫీ తాగుతానని ఆ జట్టు యజమాని షారుఖ్‌ ఖాన్‌ గతంలో ట్విటర్‌ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. 

గతంలో ట్విటర్‌ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్‌ఎస్‌ఆర్కే’ సెషన్‌లో ఓ అభిమాని.. ఈ సారి కోల్‌కతా కప్ గెలుస్తుందా..? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా.. ‘గెలుస్తుందనే అనుకుంటున్నా.. ఒకవేళ కోల్‌కతా కప్‌ గెలిస్తే ఆ కప్‌లోనే కాఫీ తాగుతాను’ అని షారుఖ్‌ ఖాన్‌ సమాధానం ఇచ్చాడు. గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని కోల్‌కతా జట్టు 2012, 2014 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. అప్పటి నుంచి మళ్లీ ఏడేళ్ల తర్వాత ఆ జట్టు ఐపీఎల్‌ ఫైనల్‌కి చేరింది. మరోవైపు ఎనిమిది సార్లు ఫైనల్‌ ఆడి మూడుసార్లు ట్రోఫీ గెలుచుకున్న చెన్నై జట్టు.. మరో కప్‌ సాధించాలనే జోష్‌తో ఉంది. హోరాహోరీగా సాగనున్న ఈ మ్యాచ్‌లో.. విజేతగా నిలిచేదెవరో మరి కొద్ది గంటల్లో తేలనుంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని