close

తాజా వార్తలు

Published : 28/02/2021 07:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

షెఫాలీకి దక్కని చోటు

దిల్లీ: టీ20ల్లో అదరగొడుతున్న యువ కెరటం షెఫాలీ వర్మకు వన్డే జట్టులో చోటు దక్కలేదు. వచ్చే నెల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్‌లో పోటీపడే భారత మహిళల జట్లను బీసీసీఐ శనివారం ప్రకటించింది. మిథాలీ రాజ్‌ సారథ్యంలో వన్డే సిరీస్, హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలో టీ20 సిరీస్‌లో భారత జట్టు ఆడనుంది. దేశవాళీ ప్రదర్శనతో పాటు బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో సత్తా చాటిన యువ క్రికెటర్లకు సెలక్టర్లు పెద్ద పీట వేశారు. వన్డే జట్టులో జులన్‌ గోస్వామి, స్మృతి మంధాన, దీప్తిశర్మ లాంటి సీనియర్లతో పాటు యువ పేసర్లు ప్రత్యూష, మోనికా  పటేల్‌లకు చోటు దక్కింది. ఫామ్‌ కోల్పోయిన వేద కృష్ణమూర్తితో పాటు వెటరన్‌ పేసర్‌ శిఖాపాండేపై నీతు డేవిడ్‌ సారథ్యంలోని సెలక్షన్‌ బృందం వేటు వేసింది. వారికి రెండు   ఫార్మాట్లలో చోటు దక్కలేదు. టీ20 జట్టులో    తెలుగమ్మాయి అరుంధతిరెడ్డి చోటు దక్కించుకుంది. యువ సీమర్‌ సిమ్రన్‌ దిల్‌ బహుదూర్‌ తొలిసారి జట్టులోకొచ్చింది. వికెట్‌కీపర్లు శ్వేతవర్మ, సుష్మావర్మలను సెలక్టర్లు రెండు ఫార్మాట్లకు ఎంపిక చేశారు. ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు లఖ్‌నవూలోని వాజ్‌పేయి స్టేడియం వేదికగా నిలవనుంది. మార్చి 7న వన్డే సిరీస్, మార్చి 20న టీ20 సిరీస్‌ ఆరంభమవుతుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని