అక్షయ్‌ కుమార్‌తో వావ్‌ అనిపించే గబ్బర్‌ సెల్ఫీ

తాజా వార్తలు

Published : 02/02/2021 09:43 IST

అక్షయ్‌ కుమార్‌తో వావ్‌ అనిపించే గబ్బర్‌ సెల్ఫీ

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ను కలిశాడు. ఎప్పుడు ఎక్కడ కలిశాడనే సమాచారం లేకపోయినా సోమవారం ఆ హీరోతో కలిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. మీతో ఉన్నంతసేపూ సరదాగా ఉంటుందని దానికి వ్యాఖ్యానం జతచేశాడు. ఓ చెరువుగట్టు పక్కన ఇద్దరూ సంతోషంగా నవ్వుతున్న ఫొటోను ధావన్‌ అభిమానులతో పంచుకున్నాడు. 

అంతకుముందు టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ దంపతులు ధావన్‌ను కలిశారు. ఆ ఫొటోను ఈ స్పిన్‌ మాంత్రికుడు తన ఇన్‌స్టాలో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ధావన్‌ మంచి ఆతిథ్యం ఇచ్చాడని పేర్కొన్నాడు. కాగా.. ధావన్‌, చాహల్‌ చివరిసారి ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడారు. ఆపై వారు తిరిగి భారత్‌కు చేరుకున్నారు. ఇక ఆసీస్‌ పర్యటనకు ముందు యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ధావన్‌ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో అతడు 17 మ్యాచ్‌ల్లో 618 పరుగులు చేశాడు. అందులో రెండు వరుస శతకాలు బాది ఐపీఎల్‌లో కొత్త రికార్డు నెలకొల్పాడు. మరోవైపు చాహల్‌ 15 మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో ఆకట్టుకున్నాడు. 

ఇవీ చదవండి..
వామిక వచ్చేసింది
నువ్వానేనా!
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని