చాహల్ భార్యతో అయ్యర్‌ అదిరే స్టెప్పులు

తాజా వార్తలు

Published : 10/02/2021 17:50 IST

చాహల్ భార్యతో అయ్యర్‌ అదిరే స్టెప్పులు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మతో కలిసి యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అదిరే స్టెప్పులు వేశాడు. ‘రోసెస్’ సాంగ్‌కు ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా స్టెప్పులు ఇరగదీశాడు. దీనికి సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దానికి ‘మా పాదాల వైపు చూస్తున్నారా?’ అని వ్యాఖ్య జత చేశాడు.

ఈ వీడియోకి కొన్ని గంటల్లోనే అయిదు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. భారత ఆటగాళ్లు చాహల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, హార్దిక్‌, కృనాల్ పాండ్య కూడా శ్రేయస్‌ డ్యాన్స్‌ను మెచ్చుకున్నారు. ధనశ్రీ.. ‘అదరగొట్టావ్‌.. కానీ ఎలా?’ అని కామెంట్ చేశారు. కాగా, డిసెంబర్‌లో చాహల్, ధనశ్రీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో ఒక్కటయ్యారు. ధనశ్రీ యూట్యూబర్‌గా నెట్టింట్లో ఎంతో ఫేమస్‌. అద్భుతమైన స్టెప్పులతో డ్యాన్స్‌ వేస్తూ సామాజిక మాధ్యమాల్లో తరచూ ఆమె వీడియోలు పోస్ట్‌ చేస్తుంటారు.

ఇవీ చదవండి

ఓటమిపై సాకులు వద్దు.. పునఃసమీక్షించండి

తప్పులు, వైఫల్యాల్ని కోహ్లీ అంగీకరిస్తాడు

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని