SRH: నిర్ణయం ఒకరిది మూల్యం మరొకరిది

తాజా వార్తలు

Updated : 02/05/2021 16:18 IST

SRH: నిర్ణయం ఒకరిది మూల్యం మరొకరిది

వార్నర్‌పై వేటును ప్రశ్నించిన సైమన్‌ డౌల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథ్యం నుంచి డేేవిడ్‌ వార్నర్‌ను తొలగించడాన్ని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ ప్రశ్నించాడు. జట్టు యాజమాన్యంతో కచ్చితంగా అతడికి విభేదాలు వచ్చే ఉంటాయని అంచనా వేశాడు. జట్టు కోచింగ్‌ బృందం కూర్పూ బాగాలేదని అన్నాడు. రాజస్థాన్‌ మ్యాచ్‌ నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌కు విలియమ్సన్‌ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

‘జట్టుతో కాకుండా జట్టు యాజమాన్యంతో కచ్చితంగా ఎక్కడో విభేదాలు వచ్చాయనే అనిపిస్తోంది. మనీశ్‌ పాండేను తుది జట్టులోంచి తప్పించడంపై వార్నర్‌ మాట్లాడాడంటే కోచింగ్‌ కూర్పులోనే ఇబ్బంది కనిపిస్తోంది. ఎందుకంటే అది అతడి నిర్ణయం కాదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే నిర్ణయం ఒకరిదైతే మూల్యం చెల్లిస్తోంది మరొకరని అర్థమవుతోంది’ అని డౌల్‌ అన్నాడు.

‘హైదరాబాద్‌ కోచింగ్‌ కూర్పు సరిగ్గా లేదు. వారి చర్యలు బాగాలేవు. మొదట కోచ్‌ టామ్‌ మూడీని తొలగించారు. ట్రెవర్‌ బేలిస్‌ను తీసుకొచ్చారు. మళ్లీ క్రికెట్‌ డైరెక్టర్‌గా మూడీని నియమించారు. ఆ చర్య ఎలా పనిచేస్తుందో అర్థం కాలేదు. 6 మ్యాచుల్లో ఒక్కటే గెలవడం చూస్తుంటే వారి సంబంధాలు పనిచేయడం లేదనే అనిపిస్తోంది. ఇక డేవిడ్‌ వార్నర్‌ ఆడటం కష్టమేనని వారి ప్రకటన ద్వారా తెలుస్తోంది. అది మరింత విచిత్రంగా అనిపించింది’ అని డౌల్‌ పేర్కొన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని