పంత్‌పై పాంటింగ్‌ రుసరుస

తాజా వార్తలు

Updated : 08/01/2021 05:43 IST

పంత్‌పై పాంటింగ్‌ రుసరుస

మరే కీపర్‌ అన్ని క్యాచులు వదల్లేదని విమర్శ

సిడ్నీ: టీమ్ఇండియా యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ మరీ పేలవంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. మూడో టెస్టు తొలిరోజు వికెట్ల వెనకాల అతడి ప్రదర్శన తీసికట్టుగా ఉందని విమర్శించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి మరెవ్వరూ వదలనన్ని ఎక్కువ క్యాచులు జారవిడిచాడని అన్నాడు. పరిస్థితి ఇలాగే ఉంటే కష్టమని, మరింత మెరుగ్గవాల్సిందని హెచ్చరించాడు.

తొలిరోజు ఆట ముగిశాక పాంటింగ్‌.. పంత్‌, పుకోస్కీ ప్రదర్శన గురించి మీడియాతో మాట్లాడాడు. సిడ్నీ టెస్టులో అరంగేట్రం చేసిన విల్‌ పుకోస్కీ 26, 32 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచులను పంత్‌ వదిలేశాడు. దాంతో ఎంతో కష్టపడి బౌలింగ్‌ వేసిన అశ్విన్‌, సిరాజ్‌ అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే.

‘‘టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రపంచంలో మరే కీపర్‌ వదిలేయనన్ని క్యాచులను పంత్‌ జారవిడిచాడు. కీపింగ్‌లో మరింత మెరుగవ్వాల్సిన పరిస్థితిని ఇది ఎత్తిచూపుతోంది. తొలిరోజు వదిలేసిన రెండు క్యాచులు నిజానికి ఒడిసిపట్టాల్సినవి. ఎందుకంటే అవెంతో తేలికైన క్యాచులు’’ అని పాంటింగ్‌ అన్నాడు. పుకోస్కీ గానీ ఔటవ్వకపోయుంటే కచ్చితంగా భారీ శతకం లేదా ద్విశతకం చేసేవాడని రికీ నొక్కి చెప్పాడు.

‘‘పిచ్‌ను చూస్తుంటే పంత్‌ బతికిపోయాడనే చెప్పొచ్చు. లేదంటే పుకోస్కీ భారీ శతకం లేదా ద్విశతకం కచ్చితంగా చేసేవాడు. ఎందుకంటే వికెట్‌ నమ్మశక్యం కానంత బాగుంది. ఆ రెండు క్యాచులు వదిలేయగానే అతడి ప్రదర్శన గురించి పంత్‌ చెత్తగా అనుకొని ఉంటాడు. ‘ఇక నా పని అయిపోయినట్టే. పుకోస్కీ నాకు తగిన మూల్యం చెల్లిస్తాడు’ అని ఆలోచించి ఉంటాడు. కానీ అలా జరగలేదు. పంత్‌ కీపింగ్‌పైనే ఆందోళన నెలకొందని నేనెప్పటి నుంచో చెబుతున్నా’’ అని పాంటింగ్‌ అన్నాడు. ఐపీఎల్‌లో దిల్లీకి ఆడుతున్న పంత్‌కు కోచ్‌ పాంటింగ్‌ అన్న సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి
పంత్‌.. ఇదేం కీపింగ్‌?
నాన్న గుర్తొచ్చే.. సిరాజ్‌ కంటతడి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని