శార్దూల్‌, సిరాజ్‌ రచించిన గబ్బా బౌలింగ్‌ వ్యూహం!
close

తాజా వార్తలు

Published : 25/01/2021 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శార్దూల్‌, సిరాజ్‌ రచించిన గబ్బా బౌలింగ్‌ వ్యూహం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిస్బేన్‌ టెస్టులో వికెట్‌కు రెండువైపులా ఒత్తిడి పెంచాలన్నది తమ ప్రణాళికని టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. ఆటకు ముందు తాను, శార్దూల్‌ ఠాకూర్‌ ఈ విషయంపై చర్చించుకున్నామని తెలిపాడు. చక్కని ప్రాంతాల్లో బంతులు వేయడంతో ఆసీస్‌ ఆటగాళ్లు త్వరగా ఔటయ్యారని వెల్లడించాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్‌ టెస్టుల్లో అరంగేట్రం చేసిన తెలిసిందే. కట్టుదిట్టమైన బంతులు వేసిన ఈ యువపేసర్‌ మొత్తంగా 13 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. రెండు, మూడో మ్యాచులో బుమ్రా సలహాలు పొందిన అతడు నాలుగో టెస్టులో ఏకంగా బౌలింగ్‌ దాడికే నేతృత్వం వహించాడు. సీనియర్లు గాయాల బారిన పడటంతో శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌, సైనికి అండగా నిలిచాడు. పైగా ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. జట్టు యాజమాన్యం, అభిమానుల నమ్మకం నిలబెట్టుకున్నాడు.

‘ఆసీస్‌ వికెట్లు తీయాలంటే వికెట్‌కు రెండువైపులా ఒత్తిడి చేయాలన్నది మా వ్యూహం. బ్రిస్బేన్‌లో శార్దూల్‌, నేను కొంత సమయం కూర్చొని చర్చించుకున్నాం. ఒత్తిడి చేయాలని నిర్ణయించుకున్నాం. స్కోరు చేయలేని ప్రాంతాలను ఎంచుకొని బంతులు వేశాం. కీలక ఆటగాళ్లు లేనప్పుడు ఏ జట్టైనా కొంత ఒత్తిడికి లోనవుతుంది. గాయాల వల్ల మేమూ గొప్ప ఆటగాళ్ల సేవలు కోల్పోయాం. మా కోచింగ్‌, సహాయ సిబ్బంది అండతోనే మేమిలా చేయగలిగాం. వికెట్‌కు రెండు వైపులా కట్టుదిట్టమైన బంతులతో ఒత్తిడి పెంచితే బ్యాట్స్‌మన్‌ కచ్చితంగా తప్పులు చేస్తారు. ఇక్కడా అదే జరిగింది. మేం ఉక్కిరిబిక్కిరి చేశాం. ఆస్ట్రేలియా ఆటగాళ్లు వికెట్లు ఇచ్చారు’ అని సిరాజ్‌ అన్నాడు.

గాయపడ్డా బౌలింగ్‌కు దిగిన సైని, అరంగేట్రంలోనే అదరగొట్టిన నటరాజన్‌ను సిరాజ్‌ ప్రశంసించాడు. ‘అరంగేట్రం మ్యాచు కావడంతో మేం గెలిచిన ట్రోఫీని నటరాజన్‌కు ఇవ్వాలని అజింక్య రహానె, రవిశాస్త్రి నిర్ణయించారు. నట్టూ నెట్‌ బౌలర్‌గా వచ్చాడు. టీ20, వన్డే, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతడో గొప్ప బౌలర్‌. ప్రశాంతంగా ఉంటాడు. అతిగా మాట్లాడడు. తన పనేంటో తెలుసు. అతడు నమ్మశక్యం కాని యార్కర్లు వేయగలడు’ అని సిరాజ్‌ తెలిపాడు.

ఇవీ చదవండి
పంత్‌ను ఆటపట్టించిన చాహల్‌, రషీద్‌
కుంబ్లేను ఎదుర్కోడానికి ద్రవిడ్‌ సాయం: తైబు

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని