close

తాజా వార్తలు

Published : 21/01/2021 17:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేసిన సిరాజ్‌ 

కొంత సమయం మా నాన్నతో గడిపాను

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ హైదరాబాద్‌ నగరానికి వచ్చిన వెంటనే ఇంటికి వెళ్లలేదు. నేరుగా శ్మశానవాటికకు చేరుకున్నాడు. తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లి తన మాతృమూర్తిని కలిశాడు. సిరాజ్‌ ప్రార్థనలు చేస్తున్న చిత్రాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ముగిసిన వెంటనే సిరాజ్‌ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన వారం రోజుల్లోనే అతడి తండ్రి మహ్మద్‌ గౌస్‌ నగరంలో కన్నుమూశారు. క్వారంటైన్‌ ఆంక్షలు, టీమ్‌ఇండియాకు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాలన్న తన తండ్రి కలను నిజం చేసేందుకు అతడు హైదరాబాద్‌కు తిరిగి రాలేదు. తండ్రి అంత్యక్రియలకు హాజరవ్వలేదు. తీవ్ర భావోద్వేగాలు కలుగుతున్నప్పటికీ అక్కడే ఉన్నాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసి సత్తా చాటాడు. ముఖ్యంగా ఆఖరి టెస్టులో బౌలింగ్‌ దళాన్ని నడిపించి శెభాష్‌ అనిపించుకున్నాడు. జాతీయగీతం విన్నప్పుడల్లా తండ్రి గుర్తొచ్చి కన్నీరు కార్చిన సంగతి తెలిసిందే.

‘నేరుగా నేనింటికి వెళ్లలేదు. విమానాశ్రయం నుంచి శ్మశానికి వెళ్లిపోయాను. అక్కడ కూర్చొని కొంత సమయం మా నాన్నతో గడిపాను. నేను ఆయనతో మాట్లాడలేకపోవచ్చు కానీ సమాధి వద్ద పుష్ఫగుచ్ఛం సమర్పించాను. ఆ తర్వాత ఇంటికొచ్చాను. అమ్మను కలిసిన వెంటనే ఆమె ఏడ్చింది. ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించాను. ఇదో వింత అనుభూతి. ఆరు నెలలుగా ఆమె నాకోసం ఎదురుచూస్తోంది. ఎప్పుడెప్పుడు నేను ఇంటికి తిరిగొస్తానా అని రోజులు లెక్క పెట్టింది’ అని సిరాజ్‌ అన్నాడు.

ఇవీ చదవండి
ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్‌
స్పైడర్‌ పంత్‌..!



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని