
తాజా వార్తలు
స్టీవ్ స్మిత్ కథలో మరో మలుపు
నెట్టింట్లో వైరల్ అవుతున్న పూర్తి వీడియో
ఇంటర్నెట్‌డెస్క్: గత రెండు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ గురించే వార్తలు! డ్రింక్స్ బ్రేక్‌లో రిషభ్ పంత్ గార్డ్ మార్క్‌ను వక్రబుద్ధితో చెరిపివేశాడని అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. బాల్‌టాంపరింగ్‌తో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైనా ఇంకా మారలేదని నెట్టింట్లో పోస్ట్‌లు పోటెత్తాయి. సెహ్వాగ్, మైకేల్ వాన్ మాజీలు కూడా స్మిత్ తప్పు చేశాడని విమర్శించారు. కానీ తానెలాంటి తప్పు చేయలేదని స్మిత్ ఎంత చెప్పినా, ఆస్ట్రేలియా జట్టు అతడిని వెనకేసుకొచ్చినా..దుర్బుద్ధితోనే స్మిత్ చేశాడనే అనుమానం ఎంతో మందిలో అలానే ఉంది.
అయితే ఈ వివాదానికి సంబంధించిన మరో వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దాన్ని చూసిన తర్వాత స్మిత్‌ది దురుద్దేశం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు వైరల్ అయిన వీడియోలో.. స్మిత్ క్రీజు వద్దకు వచ్చి పంత్ గార్డ్ మార్క్‌ను చెరిపివేస్తున్నది మాత్రమే కనిపించింది. కానీ తాజా వీడియోలో అసలు దాని కంటే ముందు ఏం జరిగిందనే విషయం వెల్లడైంది.
డ్రింక్స్ బ్రేక్‌లో మైదాన సిబ్బంది పిచ్‌ను శుభ్రం చేయడానికి వచ్చారు. బ్రష్‌తో క్రీజును శుభ్రం చేశారు. ఆ తర్వాత పెయింట్‌తో క్రీజు మార్క్ గీశారు. కాగా, సిబ్బంది బ్రష్‌తో శుభ్రం చేసినప్పుడే అక్కడ ఉన్న గ్రేడ్ మార్క్‌లు తొలగిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో స్మిత్ తప్పు చేయలేదని భావిస్తున్నారు. ఈ వీడియోతోనైనా స్మిత్‌పై ఉన్న వివాదానికి ముగింపు పడుతుంతో లేదో చూడాలి!
ఇదీ చదవండి
ఇది సిగ్గుచేటు: వివాదంపై స్పందించిన స్మిత్
స్మిత్ ఎంతో అమాయకుడు: ఆసీస్ కోచ్
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భారత్ చిరస్మరణీయ విజయం..
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
