Pink Test: ఇది అస్సలు ఊహించలేదు: స్మృతి

తాజా వార్తలు

Published : 27/05/2021 23:25 IST

Pink Test: ఇది అస్సలు ఊహించలేదు: స్మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను డే/నైట్‌ టెస్టు ఆడతానని ఎన్నడూ ఊహించలేదని టీమ్‌ఇండియా మహిళా ఓపెనర్‌ స్మృతి మంధాన పేర్కొంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టు, కంగారూలతో ఓ టెస్టు మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. దాన్ని ఇటీవలే డే/నైట్‌ టెస్టుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే స్మృతి ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యలు చేసింది. పురుషుల డే/నైట్ టెస్టులు చూసేటప్పుడు తమ జట్టూ ఇలా ఆడుతుందని అనుకోలేదని, తమకోసం కూడా ఆ   నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా సంతోషించినట్లు చెప్పింది.

‘నా తొలి డే/నైట్‌ వన్డే ఆడటం ఇంకా గుర్తుంది. చిన్నపిల్లలా ఎంతో సంతోషించాను. మేం డే/నైట్‌ మ్యాచ్‌ ఆడబోతున్నాం అని సంబరపడ్డాను. ఇప్పుడు టెస్టుల్లో అలాంటి ఆట ఆడటం చాలా ఉత్సాహంగా ఉంది. కానీ అంతకుముందు మేం అనేక విషయాలపై దృష్టి సారించాలి. ఆస్ట్రేలియా జట్టుతో వారి సొంతగడ్డపైనే ఆడటం సవాలుతో కూడుకున్నది. అది మా జట్టు సభ్యులందరికీ ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. అలాగే ఇంగ్లాండ్‌తో ఒక టెస్టు ఆడుతున్నామని తెలిసి మా అమ్మాయిలంతా సంతోషం వ్యక్తం చేశారు. నేను చివరిసారి 2014లో టెస్టు మ్యాచ్‌ ఆడాను. దాంతో ఏడేళ్ల తర్వాత తెల్ల దుస్తుల్లో క్రికెట్ ఆడటం అనేది మరింత ఆనందంగా ఉంది’ అని స్మృతి చెప్పుకొచ్చింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని