బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి గుండెపోటు

తాజా వార్తలు

Updated : 02/01/2021 17:24 IST

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి గుండెపోటు

ఇంటర్నెట్‌డెస్క్‌: బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. స్వల్ప స్థాయి గుండెపోటు రావడంతో 48 ఏళ్ల దాదా శనివారం ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, క్రిటికల్ కేరింగ్ యూనిట్‌ (సీసీయూ)లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. ప్రాథమిక యాంజియోప్లాస్టీ చేస్తారని సమాచారం.

గంగూలీకి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యబృందం ఆయనకు ప్రాథమిక యాంజియోప్లాస్టీ చేయనుందని తెలిసింది. దాదా కుటుంబీకులకు గుండె, రక్తనాళాల వ్యాధుల చరిత్ర ఉందని వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రి ఎండీ, సీఈవో డాక్టర్‌ రూపాలీ బసు తెలిపారు. డ్యుయల్‌ యాంటీ ప్లేట్‌లెట్స్‌, స్టాటిన్‌తో ఆయనకు చికిత్స చేస్తున్నామన్నారు.

‘ఆయన (గంగూలీ) పల్స్‌ 70/మిన్‌, బీపీ 130/80ఎంఎంగా ఉంది. ఇతర ప్రమాణాలన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఈసీజీ, ఎకో ద్వారా కొన్ని సమస్యలు ఉన్నట్టు గుర్తించాం. రాత్రి ఇబ్బందిగా ఉన్నా ఉదయం ఆయన కసరత్తులకు ఉపక్రమించారు’ అని ఆమె వెల్లడించారు. గంగూలీ హృదయ రక్తనాళాల్లో కాస్త పూడిక ఉండటంతో యాంజియోప్లాస్టీ చేస్తామని వైద్య నిపుణులు డాక్టర్‌ సరోజ్‌ తెలిపిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి

నా గతమే..స్మిత్‌కు ప్రస్తుతం: వార్నర్‌

అభిమాని సర్‌ప్రైజ్‌: బాగోదన్న రోహిత్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని