పిచ్‌ ఎవరికి అనుకూలంగా చేస్తున్నారంటే!
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 12:15 IST

పిచ్‌ ఎవరికి అనుకూలంగా చేస్తున్నారంటే!

సౌథాంప్టన్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సమీపించే కొద్దీ ఆసక్తి పెరుగుతోంది. సౌథాంప్టన్‌లో పిచ్‌ను వేగంగా రూపొందిస్తున్నారు. వికెట్‌ ఎలా ఉండాలో ఐసీసీ ఇప్పటికే క్యూరేటర్‌కు మార్గదర్శకాలు ఇచ్చింది. ఐదు రోజుల పోరుకు అత్యుత్తమమైన పిచ్‌ను అందించాలని ఆదేశించింది. పేస్‌, బౌన్స్‌ ఆపై స్పిన్‌కు అనుకూలించే వికెట్‌ను చూడబోతున్నారని క్యూరేటర్‌ సిమోన్‌ లీ తెలిపారు.

‘తటస్థ వేదిక కావడంతో పిచ్‌ను సిద్ధం చేయడం సులువు. ఐసీసీ మార్గదర్శకాలు ఇచ్చింది. మేం మాత్రం రెండు జట్ల మధ్య పోటీ సమానంగా ఉండేలా చక్కని పిచ్‌ను ఇవ్వబోతున్నాం. నా వరకైతే వికెట్‌లో కొంత వేగం, బౌన్స్‌ ఉండి బంతి క్యారీ అయితే బాగుంటుంది. సాధారణంగా ఇంగ్లాండ్‌లో వాతావరణం మాకు అంతగా సహకరించదు. ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతం ముందస్తు అంచనా ప్రకారం వాతావరణం పొడిగా ఉండనుంది. అందుకే వేగంతో కూడిన గట్టి పిచ్‌ను రూపొందిస్తాం’ అని లీ తెలిపారు.

‘వేగం సుదీర్ఘ ఫార్మాట్‌ను మనోరంజకంగా మార్చేస్తుంది. ఒక అభిమానిగా.. క్రికెట్‌ ప్రేమికులు ప్రతి బంతినీ చూసేలా పిచ్‌ను రూపొందించాలన్నది మా ఉద్దేశం. ఒకవైపు క్లాస్‌ బ్యాటింగ్‌తో పాటు మరోవైపు అద్భుతమైన బౌలింగ్‌ స్పెల్స్‌ వీక్షించేలా పిచ్‌ను తయారు చేస్తాం. బ్యాటర్‌, బౌలర్‌.. ఏ ఒక్కరికో కాకుండా అందరికీ అనుకూలించేలా ఉంటుంది’ అని లీ వివరించారు.

‘పిచ్‌ ముందు సీమర్ల బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేసేందుకూ వీలుంటుంది. పిచ్‌పై పగుళ్లు ఏర్పడితే స్పిన్నర్లు రాణించేందుకు అవకాశం లభిస్తుంది. అత్యున్నత స్థాయిలో ప్రతి ఆటగాడు తన ప్రతిభను ప్రదర్శించేలా పిచ్‌ను అందించాలని అనుకుంటున్నాం. అప్పుడే సంతృప్తిగా ఉంటుంది’ అని సిమోన్‌ లీ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని