WTC Final: 4వ రోజు మొత్తంగా ఆట కుదరదా?
close

తాజా వార్తలు

Updated : 07/07/2021 16:17 IST

WTC Final: 4వ రోజు మొత్తంగా ఆట కుదరదా?

సౌథాంప్టన్‌లో సోమవారం భారీ వర్షాలు

సౌథాంప్టన్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు తప్పేలా కనిపించడం లేదు. నాలుగోరోజు, సోమవారం సౌథాంప్టన్‌లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు పూర్తిగా ఆట కొనసాగే పరిస్థితి ఉండదని సమాచారం. 90 శాతానికి పైగా వర్షం కురుస్తుందని అక్కడి వాతావరణశాఖ తెలిపింది. మధ్యాహ్నం వరకు అతి భారీ, ఆ తర్వాత మోస్తరు జల్లులు కురుస్తాయని అంటున్నారు. సాయంత్రానికి కాస్త తెరపినిచ్చినా వెలుతురు ఉండదని పేర్కొంటున్నారు.

ఇప్పటికే ఈ టెస్టు మ్యాచులో తొలిరోజు పూర్తిగా వృథా అయింది. రెండో రోజు రెండు సెషన్లమేరకు ఆట జరిగింది. మూడోరోజు అరగంట ఆలస్యంగా ఆట మొదలైంది. వెలుతురు లేమితో త్వరగానే ముగిసింది. అయితే, టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసి న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ మొదలవ్వడం ఊరటనిచ్చే అంశం. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 217 పరుగులకు ఆలౌటైంది. 92 ఓవర్లు ఆడటం మాత్రం మంచి పరిణామమే! ఆదివారం ఆట ముగిసే సరికి న్యూజిలాండ్‌ 101/2తో ఉంది. విలియమ్సన్‌ (12), రాస్‌టేలర్‌ (0) క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ కాన్వే అర్ధశతకం చేయడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని